Team India: ఆసియా కప్ విజేతగా భారత్.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం..

|

Dec 22, 2024 | 11:35 AM

Under-19 Women's T20 Asia Cup Final: అండర్-19 మహిళల టీ20 ఆసియా కప్ ప్రారంభ ఎడిషన్ కౌలాలంపూర్‌లో జరిగింది. అందులో చివరి మ్యాచ్‌లో భారత జట్టు గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. టైటిల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 41 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.

Team India: ఆసియా కప్ విజేతగా భారత్.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం..
Indw Vs Banw
Follow us on

Under-19 Women’s T20 Asia Cup Final: అండర్-19 మహిళల టీ20 ఆసియా కప్ ప్రారంభ ఎడిషన్ కౌలాలంపూర్‌లో జరిగింది. అందులో చివరి మ్యాచ్‌లో భారత జట్టు గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. టైటిల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 41 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 117/7 పరుగులు చేయగా, బంగ్లాదేశ్ జట్టు ఓవర్ మొత్తం కూడా ఆడలేక 18.3 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుంది.

బౌలర్లు అద్భుతం..

ఈ టోర్నమెంట్ మొదటిసారి నిర్వహించిన సంగతి తెలిసిందే. చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ టాస్‌ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆదేశించింది. కానీ భారత జట్టు బ్యాటర్స్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయారు. కాగా, 47 బంతుల్లో 52 పరుగులతో త్రిష ఆకట్టుకుంది. దీంతో భారత్ 117 పరుగులు చేయగలిగింది. ఇప్పుడు దానిని కాపాడే బాధ్యత భారత బౌలర్లపై పడింది. స్వల్ప స్కోరును కాపాడుకునే క్రమంలో విజో జోషిత రెండో ఓవర్‌లోనే తొలి విజయాన్ని అందించింది.

ఇవి కూడా చదవండి

 

ఐదో ఓవర్లో 24 పరుగుల స్కోరుపై పరుణికా సిసోడియా రెండో దెబ్బ వేసింది. దీంతో జట్టులో మనోధైర్యం పెరిగింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ 20 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా కోలుకునే ప్రయత్నం చేయగా, సోనమ్ యాదవ్ ఒక వికెట్ తీసి మ్యాచ్‌లో భారత్ పట్టును పటిష్టం చేసింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ జట్టు కోలుకోలేక మిగిలిన 7 వికెట్లు కోల్పోయి తదుపరి 32 పరుగులు చేసింది. ఈ విధంగా 9 బంతులు మిగిలి ఉండగానే 41 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది.

విజయంలో కీలక వ్యక్తులు..

ఫైనల్‌లో హాఫ్ సెంచరీ చేసిన భారత ఓపెనర్ జి త్రిష ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికైంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా తడబడినప్పుడు, ఆమె కీలక బాధ్యతలు స్వీకరించింది. ఆమె ఒక ఎండ్‌లో నిలిచిపోయి నెమ్మదిగా స్కోర్‌ను పెంచుకుంటూ పోయింది. ఇది మాత్రమే కాదు, త్రిష తన అద్భుతమైన ఆటతీరుతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా కూడా ఎంపికైంది. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచింది.

త్రిష 5 ఇన్నింగ్స్‌లలో 120 స్ట్రైక్ రేట్, 53 సగటుతో 159 పరుగులు చేసింది. ఫైనల్ మ్యాచ్‌లో ఆయుషి శుక్లా 3.3 ఓవర్లలో 17 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. 5 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీసింది. ఫైనల్లో సోనమ్ యాదవ్ 2 వికెట్లు, పరుణికా సిసోడియా 2 వికెట్లు, జోషిత 1 వికెట్లు తీసి వారికి మద్దతుగా నిలిచారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..