Asia Cup 2023: 39 ఏళ్లుగా నెరవేరని కల.. ఆసియాకప్ చరిత్రలో ఇదేం వింతరా బాబు అంటోన్న ఫ్యాన్స్..
Asia Cup 2023 Final, India vs Pakistan: పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆసియా కప్ 2023 నుంచి నిష్క్రమించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ టోర్నీలో భారత్, పాక్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ చూడాలని అభిమానులు కోరుకున్నారు. కానీ, క్రికెట్ అభిమానులు 39 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రత్యేక మ్యాచ్ ఈసారి కూడా కనిపించలేదు.

India vs Pakistan Asia Cup 2023: ఆసియా కప్ 2023 ఫైనల్ ఏ జట్ల మధ్య జరగాలో నిర్ణయమైంది. సెప్టెంబర్ 17న భారత్, శ్రీలంక జట్లు ఫైనల్‌లో తలపడనున్నాయి. భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురుచూసినా శ్రీలంక అద్భుతమైన ఆటతీరుతో అది కుదరలేదు. అయితే ఈసారి రెండు జట్ల మధ్య 2 మ్యాచ్‌లు జరగ్గా, అందులో ఒక మ్యాచ్ వర్షం కారణంగా వాష్ అవ్వగా, మరో మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఏకపక్షంగా విజయం సాధించింది.
39 ఏళ్లు గడిచినా నెరవేరని కల..
That's some shot
Klass of Rahul. WHAT A COMEBACK #indvspak2023 #Klass pic.twitter.com/7jB8WsWgG5
— ABHISHEK ……# (@ABHISHEKDDUMBA1) September 11, 2023
1984 నుంచి ఆసియా కప్‌ను నిర్వహిస్తున్నారు. ఈసారి 16వ ఎడిషన్ టోర్నీ జరుగుతోంది. అదే సమయంలో ఈ టోర్నమెంట్ 13 సీజన్లు వన్డే ఫార్మాట్‌లో జరిగాయి. వన్డే ఫార్మాట్ 14వ సీజన్ ఇప్పుడు చివరి దశలో ఉంది. అయితే భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటి వరకు ఫైనల్ మ్యాచ్‌లో తలపడలేదు. ఈసారి భారత్-పాకిస్థాన్ జట్లు ఫైనల్స్‌కు చేరుకోవడానికి పెద్ద పోటీదారులుగా భావించినప్పటికీ, అది సాధ్యం కాలేదు.
ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ గణాంకాలు..
View this post on Instagram
ఆసియా కప్‌లో వన్డే ఫార్మాట్‌లో ఇరు జట్ల మధ్య 15 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత జట్టు 8 మ్యాచ్‌లు గెలిచింది. పాకిస్థాన్ 5 గెలిచింది. రెండు మ్యాచ్‌ల ఫలితాలు వెలువడలేదు. అదే సమయంలో ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 134 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో పాకిస్థాన్ 73 విజయాలు సాధించింది. భారత్ కేవలం 56 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. 5 మ్యాచ్‌లలో ఫలితాలు రాలేదు.
సూపర్ 4లో భారత్, పాక్ మ్యాచ్ రిజల్ట్..
View this post on Instagram
టీమిండియాకు షాకిచ్చిన బంగ్లాదేశ్ టీం..
సూపర్ 4లో చివరి మ్యాచ్ భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగింది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్ 6 పరుగులు తేడాతో పరాజయం పాలైంది. దీంతో ఆసియా కప్ 2023లో ఓటమెరుగని టీమిండియాకు బంగ్లాదేశ్ టీం భారీ షాక్ ఇచ్చి, ఫైనల్ ముందు జాగ్రత్త పడేలా చేసింది. కాగా, ఇప్పటికే ఫైనల్ చేరిన రోహిత్ సేన, ఆదివారం అంటే సెప్టెంబర్ 17న శ్రీలంకతో ఢీకొట్టనుంది.
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ రిజల్ట్ ఇదే..
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
