AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India A vs Australia A : 19 సిక్స్‌లు, 39 ఫోర్లు, 413రన్స్.. ఆస్ట్రేలియా టీమ్‌కు చుక్కలు చూపిన టీమిండియా

ప్రస్తుతం ఆస్ట్రేలియా A టీమ్ భారత పర్యటనలో ఉంది. టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత, ఇప్పుడు వన్డే సిరీస్ ప్రారంభమైంది. ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో ఇండియా A జట్టు నుండి విధ్వంసకర బ్యాటింగ్ ప్రదర్శన కనిపించింది. భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసి ఏకంగా 400 పరుగుల మార్కును దాటింది.

India A vs Australia A : 19 సిక్స్‌లు, 39 ఫోర్లు, 413రన్స్.. ఆస్ట్రేలియా టీమ్‌కు చుక్కలు చూపిన టీమిండియా
Shreyas Iyer Century
Rakesh
|

Updated on: Oct 02, 2025 | 8:22 AM

Share

India A vs Australia A : ఆస్ట్రేలియా A జట్టు ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తోంది. టెస్ట్ సిరీస్ తర్వాత మొదలైన వన్డే సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఇండియా A జట్టు బ్యాటింగ్‌తో అదరగొట్టింది. భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసి ఏకంగా 413 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ఇద్దరు సెంచరీలు, ముగ్గురు అర్ధ సెంచరీలు చేయడంతో మొత్తం ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లు 50 పరుగుల మార్కును దాటారు.

ఈ మ్యాచ్ కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరిగింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా A బౌలింగ్ ఎంచుకోవడం పూర్తిగా తప్పని తేలింది. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలోని ఇండియా A టీమ్ ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ 53 బంతుల్లో 56 పరుగులు చేయగా, ప్రియాంశ్ ఆర్య కేవలం 84 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగులు చేసి సెంచరీ కొట్టాడు.

ఆ తర్వాత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా విధ్వంసం సృష్టించాడు. అతను 83 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 110 పరుగులు చేసి మరో సెంచరీ నమోదు చేశాడు. చివర్లో రియాన్ పరాగ్ (42 బంతుల్లో 67 పరుగులు), ఆయుష్ బడోని (27 బంతుల్లో 50 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో 50 ఓవర్లలో ఇండియా A జట్టు 6 వికెట్ల నష్టానికి 413 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 19 సిక్సర్లు, 39 ఫోర్లు వచ్చాయి.

ఈ భారీ స్కోరుతో ఇండియా A జట్టు ఒక ప్రపంచ రికార్డును నెలకొల్పింది. పురుషుల లిస్ట్ A క్రికెట్ చరిత్రలో ఒక దేశపు A జట్టు 400 పరుగుల మార్కును దాటడం ఇది మూడవసారి. భారత జట్టు మినహా, ప్రపంచంలో మరే ఇతర దేశపు A జట్టు కూడా ఒకటి కంటే ఎక్కువ సార్లు 400+ స్కోరు చేయలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..