IND Vs ZIM: అరంగేట్రంలో యువీ శిష్యుడు చెత్త ప్రదర్శన.. దెబ్బకు ధోని దరిద్రమైన రికార్డు సమం అయ్యిందిగా

23 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్ అభిషేక్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో ఓపెనర్‌గా దిగాడు ఈ ఐపీఎల్ మాన్‌స్టర్. అయితే మొదటి మ్యాచ్‌లో తనదైన ముద్ర వేయలేకపోయాడు. కట్ చేస్తే.! ధోని దరిద్రమైన రికార్డును సమం చేశాడు.

IND Vs ZIM: అరంగేట్రంలో యువీ శిష్యుడు చెత్త ప్రదర్శన.. దెబ్బకు ధోని దరిద్రమైన రికార్డు సమం అయ్యిందిగా
Abhishek Sharma
Follow us

|

Updated on: Jul 06, 2024 | 8:50 PM

23 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్ అభిషేక్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో ఓపెనర్‌గా దిగాడు ఈ ఐపీఎల్ మాన్‌స్టర్. అయితే మొదటి మ్యాచ్‌లో తనదైన ముద్ర వేయలేకపోయాడు. కట్ చేస్తే.! ధోని దరిద్రమైన రికార్డును సమం చేశాడు. అరంగేట్రం మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు అభిషేక్ శర్మ. మొత్తంగా 4 బంతులు ఎదుర్కుని.. ఓ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి.. తన వికెట్ సమర్పించుకున్నాడు. టీ20 అంతర్జాతీయ అరంగేట్రంలో ఖాతా తెరవకుండానే అవుట్ అయిన నాలుగో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు అభిషేక్ శర్మ. అంతకుముందు ఎంఎస్ ధోని, కెఎల్ రాహుల్, పృథ్వీ షా ఈ వరస్ట్ రికార్డు లిస్టులో ఉన్నారు.

టీ20 అరంగేట్రంలో ఖాతా తెరవకుండానే ఔటైన భారత బ్యాటర్లు వీరే..

రియాన్ పరాగ్‌ది ఇదే పరిస్థితి..

అభిషేక్ శర్మతో పాటు రియాన్ పరాగ్ కూడా తన అరంగేట్రం మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో రియాన్ పరాగ్ 3 బంతులు ఎదుర్కుని 2 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఐపీఎల్ 2024లో అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఈ సీజన్‌లో అత్యంత విజయవంతమైన మూడో బ్యాట్స్‌మెన్‌గా పరాగ్ నిలిచాడు. అతడు 16 మ్యాచ్‌ల్లో 149.22 స్ట్రైక్ రేట్‌తో 573 పరుగులు చేశాడు. అదే సమయంలో, అభిషేక్ శర్మ 16 మ్యాచ్‌ల్లో మొత్తం 484 పరుగులు చేశాడు. అయితే ఈ ఇద్దరు ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం ఫెయిల్ అయ్యారు.

ధృవ్ జురెల్ కూడా సింగిల్ డిజిటే..

అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ మాత్రమే కాదు.. వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ ధృవ్ జురెల్ కూడా మొదటి టీ20 మ్యాచ్‌లో విఫలమయ్యాడు. 14 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ సాయంతో 6 పరుగులు మాత్రమే చేశాడు.

ఇది చదవండి: సంతకం కింద రెండు చుక్కలు పెట్టే అలవాటు మీకుందా.? దీని అర్ధం ఏంటో తెల్సా

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..