IND Vs ZIM: ఇదేం చెత్తాట సామీ.. పసికూన చేతిలో ఘోరంగా ఓడిన టీమిండియా.. స్కోర్ల వివరాలు
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘోర పరాజయం పాలయ్యింది. పసికూన చేతుల్లో భారత్ ఆలౌట్ కావడమే కాదు.. 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్(31), వాషింగ్టన్ సుందర్(27), ఆవేశ్ ఖాన్(16) మినహా మిగిలిన బ్యాటర్లు సింగిల్ డిజిట్లకే పరిమితమయ్యారు

హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘోర పరాజయం పాలయ్యింది. పసికూన చేతుల్లో భారత్ ఆలౌట్ కావడమే కాదు.. 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్(31), వాషింగ్టన్ సుందర్(27), ఆవేశ్ ఖాన్(16) మినహా మిగిలిన బ్యాటర్లు సింగిల్ డిజిట్లకే పరిమితమయ్యారు. జింబాబ్వే బౌలర్లలో చటారా, కెప్టెన్ సికిందర్ రజా చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. బెన్నెట్, మసకద్జా, ముజారబని, జొన్గ్వే చెరో వికెట్ తీశారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరగనుంది.
అంతకముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఆతిధ్య జట్టు జింబాబ్వేను బ్యాటింగ్‌కు దింపింది. మొదటి ఓవర్‌లోనే బౌలర్ ముఖేష్ కుమార్.. జింబాబ్వే ఓపెనర్ కియాను గోల్డెన్ డకౌట్ చేశాడు. అయితే ఆ తర్వాత మదేవేరే(21), బెన్నెట్(22) రెండో వికెట్‌కు 34 పరుగులు జోడించారు. ఇక కెప్టెన్ సికిందర్ రాజా(17), మైర్స్(23), వికెట్ కీపర్ మదందే(29) హ్యాండీ రన్స్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లకు జింబాబ్వే 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో రవి బిష్ణోయ్ 4 వికెట్లు.. సుందర్ 2 వికెట్లు.. ఆవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్ చెరో వికెట్ తీశారు.
ఇక 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత బ్యాటర్లు ఏమాత్రం సరైన షాట్స్‌తో అలరించలేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ(0), రుతురాజ్ గైక్వాడ్(7), రియాన్ పరాగ్(2), రింకూ సింగ్(0), ధృవ్ జురెల్(6) పేలవ షాట్స్ ఆడి తమ వికెట్లను పారేసుకున్నారు. కెప్టెన్ గిల్(31) కొద్దిసేపు అలరించగా.. సికిందర్ రాజా అతడ్ని బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఆల్‌రౌండర్ సుందర్(27), ఆవేశ్ ఖాన్(16)తో కలిసి మ్యాచ్ పూర్తి చేద్దామని చూసిన.. ఆఖరి ఓవర్‌లో టీమిండియా ఆలౌట్ అయింది. మొత్తానికి నిర్ణీత ఓవర్లకు భారత్ 102 పరుగులకు ఆలౌట్ అయ్యి.. 13 పరుగులతో ఓటమిని చవిచూసింది.
The match went down till the very last over but it’s Zimbabwe who win the 1st T20I.#TeamIndia will aim to bounce back in the 2nd T20I tomorrow.
Scorecard ▶️ https://t.co/r08h7yfNHO#ZIMvIND pic.twitter.com/FLlBZjYxCb
— BCCI (@BCCI) July 6, 2024
ఇది చదవండి: సంతకం కింద రెండు చుక్కలు పెట్టే అలవాటు మీకుందా.? దీని అర్ధం ఏంటో తెల్సా
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








