IND vs WI: వెస్టిండీస్ టూర్‌కు టీమిండియా.. జూన్ 27న ఎంపిక.. ఆ నలుగురు స్టార్‌లకు నో ఛాన్స్?

India vs West Indies: వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనున్న సంగతి తెలిసిందే. అయితే, ఇందుకోసం జూన్ 27న టీమిండియాను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

IND vs WI: వెస్టిండీస్ టూర్‌కు టీమిండియా.. జూన్ 27న ఎంపిక.. ఆ నలుగురు స్టార్‌లకు నో ఛాన్స్?
Team India
Follow us
Venkata Chari

|

Updated on: Jun 16, 2023 | 5:10 PM

India Squad for West Indies Tour: టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. వచ్చే నెలలో వెస్టిండీస్ టీంతో మూడు ఫార్మాట్లలో తలపడనుంది. అయితే, ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల మేరకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు వన్డే, టీ20 సిరీస్‌లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితిలో ఈ ఇద్దరు ఆటగాళ్లు 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను మాత్రమే ఆడతారని అంటున్నారు. అయితే, పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని మహ్మద్ సిరాజ్‌, మహ్మద్ షమీలు ఏ సిరీస్‌లోనూ అందుబాటులో ఉండరు. వెస్టిండీస్ పర్యటనలో ఇద్దరు స్టార్ ఫాస్ట్ బౌలర్లకు విశ్రాంతి ఇవ్వవచ్చని తెలుస్తోంది.

సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ వంటి చాలా మంది యువ ఆటగాళ్లు వన్డే, టెస్ట్, టీ20 సిరీస్‌లలో భాగం అవుతారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. వైట్ బాల్ జట్టులో శాంసన్, ఉమ్రాన్ చోటు దక్కించుకునే అవకాశం ఉంది. జైస్వాల్, అర్ష్‌దీప్‌లు టెస్ట్ జట్టులో భాగంగా ఉంటారని అంటున్నారు.

హార్దిక్ పాండ్యా మళ్లీ టెస్టు జట్టులోకి వచ్చే అవకాశం..

ఇన్‌సైడ్ స్పోర్ట్స్ తన నివేదికలలో BCCI సీనియర్ అధికారి వెల్లడించిన విషయాన్ని ప్రత్యేకంగా పేర్కొంది. “హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా ఒక ఎంపిక. కానీ, టెస్ట్ రిటర్న్‌లో హార్దిక్ అభిప్రాయం తప్పక తీసుకోవాలి. సెలెక్టర్లు అతనిని వైట్ జెర్సీలో చూడాలనుకుంటున్నారు. కానీ, అతను మూడు ఫార్మాట్లలో ఆడే స్థితిలో ఉన్నాడా, ముఖ్యంగా అతను వన్డేలలో ముఖ్యమైన ఆటగాడు అని, అది హార్దిక్ మాత్రమే నిర్ణయించుకోవాలి” అంటూ తన నివేదికల్లో ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

వెస్టిండీస్‌లో భారత పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే..

టెస్ట్ సిరీస్:

మొదటి మ్యాచ్ – జులై 12 నుంచి జులై 16 వరకు (విండ్సర్ పార్క్)

రెండవ మ్యాచ్ – జులై 20 నుంచి జులై 24 వరకు (క్వీన్స్ పార్క్ ఓవల్)

వన్డే సిరీస్:

తొలి మ్యాచ్ – జులై 27  (కెన్సింగ్టన్ ఓవల్)

2వ మ్యాచ్ – జులై 29 – (కెన్సింగ్టన్ ఓవల్)

3వ మ్యాచ్ – ఆగస్టు 1 – (ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌)

టీ20 సిరీస్:

తొలి మ్యాచ్ – శుక్రవారం, ఆగస్టు 4 – ట్రినిడాడ్‌ (పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో).

2వ మ్యాచ్ –  ఆదివారం, ఆగస్టు 6 – గయానా (ప్రొవిడెన్స్ స్టేడియం).

3వ మ్యాచ్ – మంగళవారం , ఆగస్టు 8- గయానా (ప్రొవిడెన్స్ స్టేడియం).

4వ మ్యాచ్ – శనివారం, ఆగస్టు 12  – ఫ్లోరిడా (సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్)

5వ మ్యాచ్ – ఆదివారం, ఆగస్టు 13 – ఫ్లోరిడా (సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..