Ashes 2023: తొలి టెస్టు నుంచి ప్రపంచ ఛాంపియన్ బౌలర్‌ ఔట్.. షాకిచ్చిన ఆస్ట్రేలియా.. ఎందుకంటే?

England vs Australia, The Ashes, 2023: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్‌పై అద్భుతంగా బౌలింగ్ చేసిన మిచెల్ స్టార్క్ 4 వికెట్లు పడగొట్టాడు. అలాగే కీలక మసయంలో బ్యాట్‌తో పరుగుల వర్షం కురిపించి, జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు.

Ashes 2023: తొలి టెస్టు నుంచి ప్రపంచ ఛాంపియన్ బౌలర్‌ ఔట్.. షాకిచ్చిన ఆస్ట్రేలియా.. ఎందుకంటే?
Ashes 2023
Follow us
Venkata Chari

|

Updated on: Jun 16, 2023 | 4:43 PM

Mitchell Starc, Ashes 2023: యాషెస్‌ సిరీస్‌లోని తొలి టెస్టు మ్యాచ్‌ నుంచి ఆస్ట్రేలియా తన స్టార్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ను తప్పించి, ఆశ్చర్యపరిచింది. అతని స్థానంలో జోష్ హేజిల్‌వుడ్ ఎంట్రీ జరిగింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌తో ఫైనల్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత యాషెస్ సిరీస్‌లోని మొదటి టెస్టులో అతను ఆడడం ఖాయమని భావించారు. కానీ, మొదటి టెస్టులోనే ఆస్ట్రేలియా షాకింగ్ నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో స్టార్క్ మొత్తం 4 వికెట్లు పడగొట్టాడు. అలాగే రెండో ఇన్నింగ్స్‌లో 41 పరుగులు చేశాడు. స్టార్క్ తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీని వేటాడాడు. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడుతూ తాను కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నట్లు ప్రకటించాడు.

ఆస్ట్రేలియా ఒకే ఒక్క మార్పు చేసిందని కమిన్స్ చెప్పుకొచ్చాడు. గత మ్యాచ్‌లో స్టార్క్ అద్భుత ప్రదర్శన చేసినా హేజిల్‌వుడ్ లాంటి బౌలర్లు జట్టులో ఉండటం గమనార్హం. పనిభారాన్ని నిర్వహించడం కోసమే ఇలా చేశామని ప్రకటించాడు.

ఇవి కూడా చదవండి

మొయిన్ అలీ రాకతో బలపడిన ఇంగ్లండ్..

అదే సమయంలో ఇంగ్లిష్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వికెట్ అద్భుతంగా కనిపిస్తోందని అన్నాడు. తనకు, తన టీమ్‌కి ఇది చాలా ప్రత్యేకమైన క్షణం అని చెప్పుకొచ్చాడు. మొయిన్ అలీ తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉంది. అతను ఏమి చేయగలడో అందరికీ తెలుసు. నిజానికి మొయిన్ అలీ రిటైరయ్యాడు. కానీ, యాషెస్‌కు ముందు అతన్ని తిరిగి తీసుకొచ్చారు.

ఇరుజట్ల ప్లేయింగ్ 11 ఇదే..

ఇంగ్లండ్: బెన్ డకెట్, జాక్ క్రాలీ, ఆలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీ, ఆలీ రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్.

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ, పాట్ కమిన్స్, నాథన్ లియోన్, జోష్ హాజిల్‌వుడ్, స్కాట్ బోలాండ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..