AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: వికెట్ తీయకున్నా రికార్డుల్లో నిలిచిన ముకేష్.. భారత్ తరఫున రెండో క్రికెటర్‌గా..

Mukesh Kumar: భారత్ తరఫున ఒకే పర్యటనలో మూడు క్రికెట్ ఫార్మాట్‌ల్లోనూ అంతర్జాతీయ ఆరంగేట్రం చేసిన రెండో ఆటగాడిగా ముకేష్ కుమార్ అవతరించాడు. ముకేష్ కంటే ముందు నటరాజన్ ఈ ఘనత సాధించాడు. 2020-21లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు ఫార్మాట్ల సిరీస్‌ల్లోనూ నటరాజన్ భారత్ తరఫున ఆరంగేట్రం చేశాడు. భారత్ తరఫున ఒకే పర్యటనలో మూడు ఫార్మట్లల్లోనూ ఆరంగేట్రం చేసిన తొలి ఆటగాడు నజరాజనే కావడం విశేషం. ఇప్పుడు వెస్టిండీస్ పర్యటన సందర్భంగా ముకేష్ కుమార్ కూడా అన్ని ఫార్మాట్లల్లోనూ ఆరంగేట్రం..

IND vs WI: వికెట్ తీయకున్నా రికార్డుల్లో నిలిచిన ముకేష్.. భారత్ తరఫున రెండో క్రికెటర్‌గా..
Mukesh Kumar
శివలీల గోపి తుల్వా
|

Updated on: Aug 04, 2023 | 4:52 PM

Share

Mukesh Kumar: భారత్, వెస్టిండీస్ మధ్య ట్రినిటాడ్‌లోని బ్రియన్ లారా స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియాపై కరేబియన్లు 4 వికెట్ల తేడాతో విజయం సాధించారు. ఇక ఈ మ్యాచ్ ద్వారా తెలుగు కుర్రాడు తిలక్ వర్మతో పాటు ముకేష్ కుమార్ కూడా టీ20 ఆరంగేట్రం చేశాడు. తిలక్ వర్మకు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కాగా.. ముకేష్ కుమార్ ఇదే వెస్టిండీస్‌ పర్యటనలో టెస్టు, వన్డే ఆరంగేట్రం చేశాడు. ఇదే ముకేష్ శర్మను రికార్డుల్లో నిలిచేలా చేసింది. భారత్ తరఫున ఒకే పర్యటనలో మూడు క్రికెట్ ఫార్మాట్‌ల్లోనూ అంతర్జాతీయ ఆరంగేట్రం చేసిన రెండో ఆటగాడిగా ముకేష్ కుమార్ అవతరించాడు. ముకేష్ కంటే ముందు నటరాజన్ ఈ ఘనత సాధించాడు. 2020-21లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు ఫార్మాట్ల సిరీస్‌ల్లోనూ నటరాజన్ భారత్ తరఫున ఆరంగేట్రం చేశాడు. భారత్ తరఫున ఒకే పర్యటనలో మూడు ఫార్మట్లల్లోనూ ఆరంగేట్రం చేసిన తొలి ఆటగాడు నజరాజనే కావడం విశేషం. ఇప్పుడు వెస్టిండీస్ పర్యటన సందర్భంగా ముకేష్ కుమార్ కూడా అన్ని ఫార్మాట్లల్లోనూ ఆరంగేట్రం చేసి రెండో టీమిండియా ఆటగాడిగా అవతరించాడు.

అయితే గురువారం జరిగిన తొలి టీ20లో భారత్ ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌ని బౌలర్లు కొంతమేర కట్టడి చేయడంతో కరేబియన్లు నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్లు కొల్పోయి 145 పరుగులు చేశారు. ఈ క్రమంలో భారత్ తరఫున యుజ్వేంద్ర చాహల్, ఆర్ష్‌దీప్ సింగ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీసుకున్నారు. ఆరంగేట్ర బౌలర్ ముకేష్ కుమార్ 3 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చాడు, కానీ అతనికి వికెట్ దక్కలేదు. అనంతరం 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఇషాన్ కిషన్(6), శుభమాన్ గిల్(3) శుభారంభాన్ని అందించలేకపోయారు. వన్‌డౌన్‌లో వచ్చిన సూర్య కుమార్ యాదవ్ 21 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఆరంగేట్ర మ్యాచ్ ఆడుతున్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మ తొలి టీ20లోనే దుమ్ము రేపాడు. 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 22 బంతుల్లో 39 పరుగులు చేసి అందరి ప్రశంసలను అందుకుంటున్నాడు.

ఇవి కూడా చదవండి

అలాగే ఆ తర్వాత హార్దిక్ 19, సంజూ శామ్సన్ 12, అక్షర్ పటేల్ 13 పరుగులతో మెప్పించలేకపోయారు. అక్షర్ పెవిలియన్ చేరిన తర్వాత ఆట అయిపోయిందన్న సమయంలో అర్ష్‌దీప్ వచ్చిన వెంటనే 2 ఫోర్లతో మ్యాచ్‌పై ఆశలు నిలిపాడు. కానీ వాటిని అతను సఫలీకృతం చేయలేకపోయాడు. చివరి బంతికి 6 పరుగులు అవసరమైనప్పుడు వచ్చిన ముకేష్ సింగిల్ మాత్రమే రాబట్టగలిగాడు. దీంతో టీమిండియా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ ఓడిపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..