IND vs WI: భారత పర్యటనలో వెస్టిండీస్‌దే పైచేయి అవుతుంది.. కరీబియన్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ..

వెస్టిండీస్ భారత పర్యటనకు వెస్టిండీస్ జట్టు ఇంకా రానే లేదు. సిరీస్ ఆడేందుకు భారత జట్టు ఇంకా సన్నాహాలు కూడా ప్రారంభించలేదు. కానీ..

IND vs WI: భారత పర్యటనలో వెస్టిండీస్‌దే పైచేయి అవుతుంది.. కరీబియన్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ..
Ind Vs Wi
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jan 29, 2022 | 3:41 PM

వెస్టిండీస్ భారత పర్యటనకు వెస్టిండీస్ జట్టు ఇంకా రానే లేదు. సిరీస్ ఆడేందుకు భారత జట్టు ఇంకా సన్నాహాలు కూడా ప్రారంభించలేదు. కానీ అప్పుడే వన్డే, టీ20 సిరీస్‌ల ఫలితాలను చెప్పెస్తున్నాడు కరీబియన్ జట్టు మాజీ కెప్టెన్ డారెన్ సామీ(darren sammy). అతని అంచనాల ప్రకారం ఫిబ్రవరిలో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లలో భారత్‌పై వెస్టిండీస్‌దే పైచేయి అని చెప్పాడు. వెస్టిండీస్‌ భారత పర్యటన ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో తొలత వన్డే సిరీస్‌ జరగనుంది. ఆ తర్వాత టీ20 సిరీస్ ఉంటుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ(Narendra Modi) స్టేడియంలో మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌(Eaden Garden)లో టీ20 సిరీస్ జరగనుంది.

టీ20 ప్రపంచకప్‌ను రెండుసార్లు గెలుచుకున్న ఏకైక కెప్టెన్ PTIతో మాట్లాడుతూ, “భారత జట్టు బలంగా ఉంది, కానీ వెస్టిండీస్‌కు అన్ని అవకాశాలు ఉన్నాయి. కరీబియన్ కెప్టెన్ పొలార్డ్ భారత్‌లో ఆడిన అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. భారత్‌పై వచ్చిన అవకాశాలను పొలార్డ్ బాగా ఉపయోగించుకోగలడు. ఎందుకంటే భారత్‌లో పరిస్థితి వారికి తెలుసు. అతను ఇక్కడ చాలా క్రికెట్ ఆడాడు.’ అని అన్నాడు.

‘వెస్టిండీస్ ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో స్వదేశంలో సిరీస్ ఆడుతోంది. భారత్‌పై తమదైన ముద్ర వేయగల ఇలాంటి కొత్త ముఖాలు చాలా మంది ఈ సిరీస్‌లో కనిపించారు. భారత్‌లో వెస్టిండీస్ జట్టు పటిష్ట ప్రదర్శన ఇస్తుందని భావిస్తున్నాను. మరోవైపు కేఎల్ రాహుల్ సారథ్యంలోని భారత జట్టు దక్షిణాఫ్రికాలో జరిగిన వన్డే సిరీస్‌ను 0-3తో కోల్పోయింది. దక్షిణాఫ్రికాతో ఆడిన సిరీస్‌లో భారత్‌ ప్రతి విభాగంలోనూ తడబడింది. కెమర్ రోచ్ పునరాగమనంతో వెస్టిండీస్ జట్టుకు బలం వచ్చిందని సామీ అన్నాడు. ఎందుకంటే 33 ఏళ్ల బౌలర్‌కి కొత్త బంతితో వికెట్లు తీయడంలో నైపుణ్యం ఉంది.

Read Also.. Gautam Gambir: వికెట్లు తీయడంలో అతను నిపుణుడు.. గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..