AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI 1st T20: నేడే తొలి మ్యాచ్.. భారత్-వెస్టిండీస్ టీ20ఐ సిరీస్ పూర్తి షెడ్యూల్ ఇదే..

IND vs WI 1st T20: భారత్ vs వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ ముగిసింది. మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇప్పుడు వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో శుభారంభం చేయాలనే లక్ష్యంతో హార్దిక్ పాండ్యా జట్టు భావిస్తోంది.

IND vs WI 1st T20: నేడే తొలి మ్యాచ్.. భారత్-వెస్టిండీస్ టీ20ఐ సిరీస్ పూర్తి షెడ్యూల్ ఇదే..
Ind Vs Wi 1st T20
Venkata Chari
|

Updated on: Aug 03, 2023 | 7:08 AM

Share

IND vs WI 1st T20: భారత్ vs వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ ముగిసింది. మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇప్పుడు వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ గురువారం నుంచి ప్రారంభం కానుంది.

ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో శుభారంభం చేయాలనే లక్ష్యంతో హార్దిక్ పాండ్యా జట్టు భావిస్తోంది. భారత్, వెస్టిండీస్ మధ్య గురువారం ఆగస్టు 3న తొలి టీ20 జరగనుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం..

భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టీ20 మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ మ్యాచ్‌ను ఏ టీవీ ఛానెల్‌లో చూడొచ్చు?

భారత్, వెస్టిండీస్ మధ్య జరిగే టీ20 సిరీస్ దూరదర్శన్ స్పోర్ట్స్ (డీడీ స్పోర్ట్స్) ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ఏ యాప్, వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూడొచ్చు?

ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం ఫ్యాన్‌కోడ్, JioCinema యాప్, వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

భారత్-వెస్టిండీస్ టీ20 సిరీస్ షెడ్యూల్:

ఆగస్టు 3- మొదటి టీ20 మ్యాచ్ (బ్రియన్ లారా స్టేడియం, ట్రినిడాడ్)

ఆగస్టు 6 – రెండవ టీ20 మ్యాచ్ (ప్రావిడెన్స్ స్టేడియం, గయానా)

ఆగస్ట్ 8 – మూడో టీ20ఐ (ప్రావిడెన్స్ స్టేడియం, గయానా)

ఆగస్టు 12 – నాల్గవ టీ20ఐ (సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్ స్టేడియం, ఫ్లోరిడా)

ఆగస్టు 13 – ఐదవ టీ20ఐ (సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్ స్టేడియం, ఫ్లోరిడా)

టీ20 సిరీస్ కోసం రెండు జట్లు:

భారత టీ20 జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభమన్ గిల్, యస్సవి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

వెస్టిండీస్ టీ20 జట్టు: రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), కైల్ మేయర్స్ (వైస్ కెప్టెన్), జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకీల్ హొస్సేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఒబెడ్ మెక్‌కాయ్, నికోలస్ పూరన్ షెపర్డ్, ఓడియన్ స్మిత్, ఒషానే థామస్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?