IND vs SL: మెరుపు సెంచరీలతో చెలరేగిన గిల్, కోహ్లీ.. లంకేయుల ముందు భారీ టార్గెట్
ఈ మ్యాచ్‌లో హైలెట్ అంటే విరాట్ కోహ్లీ ఇన్నింగ్సే. 85 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న అతను ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. మొత్తం 110 బంతులు ఎదుర్కొన్న విరాట్ 166 పరుగులు చేశాడు. అ

తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో భారత క్రికెట్ జట్టు భారీ స్కోరు సాధించింది. విరాట్ కోహ్లీతో పాటు ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది టీమిండియా. ఈ మ్యాచ్‌లో హైలెట్ అంటే విరాట్ కోహ్లీ ఇన్నింగ్సే. 85 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న అతను ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. మొత్తం 110 బంతులు ఎదుర్కొన్న విరాట్ 166 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఇక గిల్ 97 బంతులు ఎదుర్కొని 116 పరుగులు చేశాడు. ఇందులో14 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. గిల్ వన్డే కెరీర్‌లో ఇది రెండో సెంచరీ. అంతకుముందు జింబాబ్వేపై సెంచరీ సాధించాడు. అదే సమయంలో వన్డేల్లో కోహ్లీకి ఇది రెండో అత్యధిక స్కోరు.ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రోహిత్, గిల్‌లు టీమ్‌ఇండియాకు శుభారంభం అందించారు. శ్రీలంక బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. అయితే 95 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. రోహిత్‌ను ఔట్ చేసి భారత్‌కు తొలి దెబ్బ కొట్టాడు చమిక కరుణరత్నే. రోహిత్ 49 బంతుల్లో 42 పరుగులు చేశాడు. హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.
రోహిత్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ గిల్‌తో కలిసి శ్రీలంక బౌలర్లను చిత్తు చేశారు. రెండో వికెట్‌కు వేగంగా 131 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 226 పరుగుల వద్ద గిల్ ఔటైనా కోహ్లీ తన దూకుడును కొనసాగించాడు. వరుస బౌండరీలతో సిరీస్‌లో రెండో సెంచరీ నమోదు చేశాడు. అంతకుముందు తొలి వన్డేలోనూ అతను సెంచరీ సాధించాడు. ఇక శ్రీలంకపై వన్డేల్లో కోహ్లీకి ఇది 10వ సెంచరీ. శ్రేయస్ అయ్యర్ 38 పరుగులతో రాణించగా, రాహుల్ (7), సూర్యకుమార్ యాదవ్ (4) విఫలమయ్యారు. అక్షర్ పటేల్ రెండు పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. శ్రీలంక తరుపున రచిత 10 ఓవర్లలో 81 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. లహిరు కుమార 10 ఓవర్లలో 87 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. కరుణరత్నే ఎనిమిది ఓవర్లలో 58 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.




Innings Break!
A stupendous knock of 166* from @imVkohli & a fine 116 by @ShubmanGill guides #TeamIndia to a formidable total of 390/5.
Scorecard – https://t.co/muZgJH3f0i #INDvSL @mastercardindia pic.twitter.com/aGHQU7PQVw
— BCCI (@BCCI) January 15, 2023
?? ??? ????!
ALL of @imVkohli‘s 8️⃣ mighty sixes from his spectacular knock ?
Watch ? #INDvSLhttps://t.co/rxy1DYa498 pic.twitter.com/AKSt2hgrAl
— BCCI (@BCCI) January 15, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..




