AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: దినుష వీరోచిన పోరాటం.. డ్రాగా ముగిసిన కొలంబో టెస్ట్.. 1-0తో సిరీస్ భారత్ కైవసం

IND vs SL: శ్రీలంక, భారత్ రెండో టెస్టు ఉత్కంఠభరితంగా డ్రాగా ముగిసింది. భారత్ ఫాలోఆన్ విధించినా సోనల్ దినుష, పసిందు సూరియబండార అద్భుత పోరాటంతో శ్రీలంక మ్యాచ్‌ను కాపాడుకుంది. దినుష 133 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కొలంబో టెస్టు డ్రా అయినప్పటికీ, టీమిండియా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది.

IND vs SL: దినుష వీరోచిన పోరాటం.. డ్రాగా ముగిసిన కొలంబో టెస్ట్.. 1-0తో సిరీస్ భారత్ కైవసం
Ind Vs Sl
Rakesh
|

Updated on: Aug 27, 2026 | 5:02 PM

Share

IND vs SL: శ్రీలంకతో కొలంబోలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ ఉత్కంఠభరితంగా డ్రాగా ముగిసింది. భారత్ ఫాలోఆన్ విధించినప్పటికీ శ్రీలంక బ్యాటర్లు ఆఖరి రోజు అద్భుత పోరాటపటిమ చూపించి మ్యాచ్‌ను కాపాడుకున్నారు. కొలంబో టెస్ట్ డ్రా అయినప్పటికీ, మొదటి మ్యాచ్‌ను గెలుచుకున్న భారత్ 1-0 తేడాతో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. ట్రాక్ రికార్డ్ ఆధారంగా కొలంబోలోని SSC మైదానంలో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 503 పరుగుల భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దేవదత్ పడిక్కల్ సెంచరీ (117), ధ్రువ్ జురెల్ అజేయ సెంచరీతో (115 నాటౌట్) రాణించారు. వారితో పాటు రిషభ్ పంత్ 63, కెప్టెన్ గిల్ 50, యశస్వి జైస్వాల్ 45, రవీంద్ర జడేజా 43 పరుగులు చేసి జట్టు స్కోరు 500 దాటడంలో కీలక పాత్ర పోషించారు.

ఫాలోఆన్ అస్త్రం ఉపయోగించిన భారత్

భారత భారీ స్కోరుకు సమాధానంగా తొలి ఇన్నింగ్స్‌లోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు తీవ్రంగా ఒత్తిడిలోకి నెట్టారు. లంక తరఫున సోనల్ దినుష 103 పరుగులు చేయగా, పసిందు సూరియబండార 80 పరుగులు జోడించారు. దీంతో లంక తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకే పరిమితమైంది. మొదటి ఇన్నింగ్స్ ముగిసేసరికి టీమిండియాకు 213 పరుగుల భారీ ఆధిక్యం లభించడంతో కెప్టెన్ గిల్ ప్రత్యర్థి జట్టుకు ఫాలోఆన్ ఇచ్చి రెండోసారి బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

ఇది కూడా చదవండి: Cricketer Ban: డోపింగ్ ఉచ్చులో 36 ఏళ్ల క్రికెటర్.. 94 మ్యాచ్‌లు ఆడిన వెటరన్ బ్యాటర్ పై 15 నెలల నిషేధం

మ్యాచ్‌ను తిప్పేసిన సోనల్ దినుష

రెండో ఇన్నింగ్స్‌లో ఓటమి ఖాయమనుకున్న స్థితి నుంచి శ్రీలంక బ్యాటర్లు ఊహించని రీతిలో కోలుకున్నారు. ఆ జట్టు యువ బ్యాటర్ సోనల్ దినుష 264 బంతుల్లో 133 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. ఆయనకు తోడుగా పసిందు సూరియబండార 92 పరుగులు, కమిందు మెండిస్ 55 పరుగులు చేశారు. టెయిలెండర్ కేశర నువంత 46 పరుగుల కీలకమైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియా గెలుపు ఆశలను దెబ్బతీశాడు. లంక ఆఖరి రోజు 4 వికెట్లు కోల్పోకుండా జాగ్రత్తపడి మ్యాచ్‌ను నిలబెట్టుకుంది.

ఇది కూడా చదవండి: T20 Cricket Records: ఆ ఆనందం కాసేపు కూడా లేదు.. బట్లర్‌ను వెనక్కి నెట్టి మళ్ళీ నంబర్ 1గా కీరన్ పోలార్డ్

ఆఖరి రోజు మ్యాచ్ డ్రాగా ముగింపు

శ్రీలంక ద్వితీయ ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 429 పరుగులు సాధించింది. లంక వద్ద 200 పైగా ఆధిక్యం ఉండటం, మ్యాచ్‌లో కేవలం 17 ఓవర్ల ఆట మాత్రమే మిగిలి ఉండటంతో విజయం సాధించే అవకాశం రెండు జట్లకూ లేకుండా పోయింది. ఈ క్రమంలో ఇరు జట్ల కెప్టెన్లు అంగీకారంతో మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. మొదటి టెస్టులో భారత్ విజయం సాధించడంతో ఈ 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 1-0తో టీమిండియా వశమైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
డ్రాగా ముగిసిన కొలంబో టెస్ట్.. 1-0తో సిరీస్ భారత్ కైవసం
డ్రాగా ముగిసిన కొలంబో టెస్ట్.. 1-0తో సిరీస్ భారత్ కైవసం
'ఇరుముడి'పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు.. రవితేజ రిప్లై ఏంటంటే?
'ఇరుముడి'పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు.. రవితేజ రిప్లై ఏంటంటే?
అబద్ధాలతో సాధించిన విజయం పేకమేడలా కూలాల్సిందే.. నీలిరంగు నక్క కథ
అబద్ధాలతో సాధించిన విజయం పేకమేడలా కూలాల్సిందే.. నీలిరంగు నక్క కథ
నయనతార వాచ్.. అందరిని ఆకర్షిస్తున్న లుక్..
నయనతార వాచ్.. అందరిని ఆకర్షిస్తున్న లుక్..
శ్రీరాముడికి రాఖీ ఎవరు కట్టారు? ఆయనకు నిజంగానే సోదరి ఉందా?
శ్రీరాముడికి రాఖీ ఎవరు కట్టారు? ఆయనకు నిజంగానే సోదరి ఉందా?
దేశాల వారీగా గల్లంతైన పర్యాటకుల వివరాలు
దేశాల వారీగా గల్లంతైన పర్యాటకుల వివరాలు
పిల్లలు ఎగిరి గంతేసే వార్త.. మళ్లీ తెరుచుకోనున్న డిస్నీల్యాండ్‌!
పిల్లలు ఎగిరి గంతేసే వార్త.. మళ్లీ తెరుచుకోనున్న డిస్నీల్యాండ్‌!
రిక్షా తొక్కేవాడి కొడుకని గెంటారు.. సరిగ్గా పదేళ్లకి IAS అయ్యాడు!
రిక్షా తొక్కేవాడి కొడుకని గెంటారు.. సరిగ్గా పదేళ్లకి IAS అయ్యాడు!
రాఖీ స్పెషల్.. స్వీట్ షాప్ స్టైల్‌లో హల్వా ఇంట్లో ఎలా చేయాలంటే?
రాఖీ స్పెషల్.. స్వీట్ షాప్ స్టైల్‌లో హల్వా ఇంట్లో ఎలా చేయాలంటే?
29 ఏళ్ల వయసు చిన్నదైన భార్య.. ఈ తోపు విలన్ ప్రేమ కథ తెలిస్తే..
29 ఏళ్ల వయసు చిన్నదైన భార్య.. ఈ తోపు విలన్ ప్రేమ కథ తెలిస్తే..