AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 Cricket Records: ఆ ఆనందం కాసేపు కూడా లేదు.. బట్లర్‌ను వెనక్కి నెట్టి మళ్ళీ నంబర్ 1గా కీరన్ పోలార్డ్

T20 Cricket Records: టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డు కోసం కీరన్ పోలార్డ్, జోస్ బట్లర్ మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. సీపీఎల్‌లో 26 బంతుల్లో 65 పరుగులతో పోలార్డ్ మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. 749 మ్యాచ్‌ల్లో 14,921 పరుగులతో 15 వేల పరుగుల మైలురాయికి చేరువయ్యాడు. బట్లర్ 14,890 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు.

T20 Cricket Records: ఆ ఆనందం కాసేపు కూడా లేదు.. బట్లర్‌ను వెనక్కి నెట్టి మళ్ళీ నంబర్ 1గా కీరన్ పోలార్డ్
Kieron Pollard
Rakesh
|

Updated on: Aug 27, 2026 | 3:30 PM

Share

T20 Cricket Records: టీ20 క్రికెట్ ప్రపంచంలో నంబర్ 1 స్థానం కోసం సాగుతున్న హోరాహోరీ పోరు అభిమానులకు నిరంతం ఉత్కంఠను పంచుతోంది. టి20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా కీరన్ పోలార్డ్ మళ్ళీ చరిత్ర సృష్టించాడు. కేవలం 22 రోజుల క్రితం ఇంగ్లాండ్ స్టార్ జోస్ బట్లర్ ఈ రికార్డును సొంతం చేసుకోగా, తాజాగా సీపీఎల్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన పోలార్డ్ మళ్ళీ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని సంచలనం సృష్టించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) 2026 టోర్నీలో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టు తరఫున మైదానంలోకి దిగిన కీరన్ పోలార్డ్, సెయింట్ లూసియా కింగ్స్‌పై శివతాండవం చేశాడు. కేవలం 26 బంతుల్లోనే 65 పరుగులు కొట్టి మైదానాన్ని హోరెత్తించాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 5 సుడిగాలి సిక్సర్లు ఉండటం విశేషం. మ్యాచ్ ప్రారంభానికి ముందు నంబర్ 1 స్థానాన్ని దక్కించుకోవడానికి పోలార్డ్‌కు 35 పరుగులు అవసరం కాగా, తక్కువ సమయంలోనే ఆ మైలురాయిని దాటేసి మళ్ళీ టి20 ప్రపంచ రారాజుగా నిలిచాడు.

749 మ్యాచ్‌ల్లో 14,921 పరుగులు

ఈ విశ్వరూప ఇన్నింగ్స్ తర్వాత పోలార్డ్ ఖాతాలో 749 టీ20 మ్యాచ్‌లలో ఏకంగా 14,921 పరుగులు చేరాయి. 31.81 సగటుతో ఆడిన ఈ కెరీర్‌లో 2 సెంచరీలు, 71 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టి20 క్రికెట్ చరిత్రలోనే మొదటిసారిగా 15 వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి పోలార్డ్ కేవలం 79 పరుగుల దూరంలో ఉన్నాడు. లీగ్ దశలో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టుకు మరో ఆరు మ్యాచ్‌లు మిగిలి ఉండటంతో, త్వరలోనే ఈ అరుదైన మైలురాయిని చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

కేవలం 22 రోజులే నిలిచిన బట్లర్ అగ్రస్థానం

ఆగస్టు ఆరంభంలో ది హండ్రెడ్ 2026 టోర్నీలో ఆడుతున్న సమయంలో జోస్ బట్లర్ 526 మ్యాచ్‌ల్లో 14,890 పరుగులు సాధించి పోలార్డ్‌ను వెనక్కి నెట్టాడు. అయితే బట్లర్ ఆనందం కేవలం 22 రోజులు మాత్రమే నిలిచింది. పోలార్డ్ మళ్ళీ విజృంభించడంతో బట్లర్ 14,890 పరుగులతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. బట్లర్ ఖాతాలో 9 సెంచరీలు, 106 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

నంబర్ 1 కోసం హోరాహోరీ పోరు

ఈ రికార్డు సమరం ఇక్కడితో ముగిసేలా కనిపించడం లేదు. ఇంగ్లాండ్ జట్టు త్వరలోనే శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో బట్లర్ పరుగులు సాధిస్తే మళ్ళీ పోలార్డ్‌ను అధిగమించే అవకాశం ఉంటుంది. మరోవైపు సీపీఎల్‌లో పోలార్డ్‌కు మరిన్ని మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. జట్టు నాకౌట్స్, ఫైనల్ చేరితే పోలార్డ్ 15 వేల మైలురాయిని దాటడమే కాకుండా బట్లర్‌పై తన ఆధిక్యాన్ని మరింత పెంచుకునేందుకు సువర్ణ అవకాశం దక్కుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టీమిండియాలో కాదు.. నెక్ట్స్ సచిన్‌ ఆ దేశస్తుడే
టీమిండియాలో కాదు.. నెక్ట్స్ సచిన్‌ ఆ దేశస్తుడే
బట్లర్‌ను వెనక్కి నెట్టి మళ్ళీ నంబర్ 1గా కీరన్ పోలార్డ్
బట్లర్‌ను వెనక్కి నెట్టి మళ్ళీ నంబర్ 1గా కీరన్ పోలార్డ్
ఆయన గొప్ప నటుడు.. సాయం కోసం ఆ హీరో ఇంటికి వెళ్తే ఏమన్నారంటే..
ఆయన గొప్ప నటుడు.. సాయం కోసం ఆ హీరో ఇంటికి వెళ్తే ఏమన్నారంటే..
మెడికల్ కాలేజీలో ఘోరం.. అప్పుడే పుట్టిన 60 మంది చిన్నారులు మృతి!
మెడికల్ కాలేజీలో ఘోరం.. అప్పుడే పుట్టిన 60 మంది చిన్నారులు మృతి!
జియో సంచలన ప్లాన్‌.. ఇది కేవలం రూ.200కే 15 OTTలు, 30GB డేటా..!
జియో సంచలన ప్లాన్‌.. ఇది కేవలం రూ.200కే 15 OTTలు, 30GB డేటా..!
విగ్రహారాధనలోని అసలు తత్వం ఇదే.. రమణ మహర్షి
విగ్రహారాధనలోని అసలు తత్వం ఇదే.. రమణ మహర్షి
టాప్‌ 5 క్రెడిట్‌ కార్డులు ఇవే..! వీటిలో ఏది తీసుకుంటే బెస్ట్?
టాప్‌ 5 క్రెడిట్‌ కార్డులు ఇవే..! వీటిలో ఏది తీసుకుంటే బెస్ట్?
వన్డే క్రికెట్లో ఒక్కసారి కూడా డకౌట్ కాని ఆటగాళ్లు వీరే
వన్డే క్రికెట్లో ఒక్కసారి కూడా డకౌట్ కాని ఆటగాళ్లు వీరే
యూట్యూబ్‏లో దెయ్యం సినిమా.. ఉత్కంఠ, మలుపులతో సాగే హారర్ థ్రిల్లర్
యూట్యూబ్‏లో దెయ్యం సినిమా.. ఉత్కంఠ, మలుపులతో సాగే హారర్ థ్రిల్లర్
ఒక్క కప్పు బొంబాయి రవ్వతో అద్దిరిపోయే స్వీట్.. ఇలా చేసుకోండి..
ఒక్క కప్పు బొంబాయి రవ్వతో అద్దిరిపోయే స్వీట్.. ఇలా చేసుకోండి..