AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: కేప్ టౌన్‌లో అదరగొట్టిన రిషబ్ పంత్.. సెంచరీతో కీలక ఇన్నింగ్స్..!

Rishabh Pant: రిషబ్ పంత్ కెరీర్‌లో ఇది నాలుగో టెస్టు సెంచరీ. గతంలో ఇంగ్లండ్‌పై రెండు, ఆస్ట్రేలియాపై ఒక సెంచరీ సాధించాడు.

IND vs SA: కేప్ టౌన్‌లో అదరగొట్టిన రిషబ్ పంత్.. సెంచరీతో కీలక ఇన్నింగ్స్..!
India Vs Sa; Rishabh Pant
Venkata Chari
|

Updated on: Jan 13, 2022 | 7:08 PM

Share

India Vs South Africa 2021: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కేప్ టౌన్ టెస్టు(Cape Town Test)లో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్(Rishabh Pant) అద్భుత సెంచరీ సాధించాడు. జనవరి 13, గురువారం జరిగిన మ్యాచ్‌లో మూడో రోజు భారత రెండో ఇన్నింగ్స్‌లో పంత్ అద్భుతమైన సెంచరీతో ఆడి, క్లిష్ట పరిస్థితుల నుంచి టీమిండియాను గట్టెక్కించాడు. పంత్ తన టెస్టు కెరీర్‌లో 120 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో నాలుగో సెంచరీని నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాపై పంత్‌కి ఇదే తొలి టెస్టు సెంచరీ కావడం విశేషం. అదే సమయంలో, ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్(KL Rahul) తర్వాత సెంచరీ చేసిన రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ సెంచరీ ఇన్నింగ్స్‌లో పంత్ గొప్ప రికార్డు కూడా నెలకొల్పాడు.

మ్యాచ్ మూడో రోజు తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు తొలి రెండు ఓవర్లలోనే చెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేల వికెట్లను చేజార్చుకుంది. దీని తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్.. కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. కోహ్లి ఓ వైపు డిఫెన్సివ్ బాల్‌తో వికెట్‌ను కాపాడుతుండగా, మరోవైపు పంత్ పరుగుల వేగాన్ని పెంచడం ప్రారంభించాడు. తొలి సెషన్ చివరి ఓవర్లో పంత్ కేవలం 58 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆసియా వెలుపల సెంచరీలు చేసిన వికెట్ కీపర్ల జాబితాలో రిషబ్ పంత్ అగ్రస్థానంలో చేరాడు. ఇప్పటి వరకు మూడు సెంచరీలు చేసిన పంత్.. ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.

టీమిండియా రెండో ఇన్నింగ్స్ ముగిసింది. 198 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. దీంతో సౌతాఫ్రికా ముందు 212 పరుగుల టార్గెట్ ఉంది. భారత ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ 100* నాటౌట్‌గా నిలిచి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ పెద్దగా రాణించలేకపోవడంతో 198 పరుగులకే భారత్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. ఈ టెస్టులో గెలవాలంటే భారం అంతా బౌలర్లపైనే నిలిచింది.

ఆసియా వెలుపల భారత వికెట్ కీపర్ల టెస్ట్ సెంచరీలు..

118 మంజ్రేకర్ vs వెస్టిండీస్, ​​కింగ్‌స్టన్ 1952/53

115* రాత్ర vs వెస్టిండీస్, ​​సెయింట్ జాన్స్ 2002

104 సాహా vs వెస్టిండీస్, ​​గ్రాస్ ఐలెట్ 2016

114 రిషబ్ పంత్ vs ఇంగ్లండ్, ది ఓవల్ 2018

159* రిషబ్ పంత్ vs ఆస్ట్రేలియా 2018/19

100* రిషబ్ పంత్ vs సౌతాఫ్రికా, కేప్ టౌన్ 2021/22

Also Read: IND vs SA: కేప్ టౌన్‌ టెస్ట్‌తో వీరిద్దరి కెరీర్‌కు ముగింపు? మిడిలార్డర్‌లో మార్పులకు ఇదే శుభతరుణం అంటోన్న మాజీలు

IND vs SA: విరాట్ కోహ్లీకి ప్రత్యేక హోదా తెచ్చిన భారత పేస్ బౌలర్లు.. అదేంటో తెలుసా?