IND vs SA: మళ్లీ నిరాశ పర్చిన రోహిత్‌, జైస్వాల్‌.. తొలిటెస్టుపై పట్టు బిగించిన దక్షిణాఫ్రికా.. స్కోర్లు ఇవే

నాంద్రే బెర్గర్ (0)ను జస్ప్రీత్ బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయడంతో దక్షిణాఫ్రికా తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. అయితే గాయం కారణంగా కెప్టెన్ టెంబా బావుమా బ్యాటింగ్‌కు రాలేదు. దీంతో 408 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ ముగిసింది. దక్షిణాఫ్రికా తరఫున డీన్ ఎల్గర్ తొలి ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 185 పరుగులు చేశాడు. మార్కో జెన్సన్ 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

IND vs SA: మళ్లీ నిరాశ పర్చిన రోహిత్‌, జైస్వాల్‌.. తొలిటెస్టుపై పట్టు బిగించిన దక్షిణాఫ్రికా.. స్కోర్లు ఇవే
India Vs South Africa
Follow us
Basha Shek

|

Updated on: Dec 28, 2023 | 6:15 PM

భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికా పట్టు బిగించింది. ఓవర్‌నైట్‌ 256/5 స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా 408 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 163 ​​పరుగుల కీలక ఆధిక్యం సాధించింది సఫారీ టీమ్‌. నాంద్రే బెర్గర్ (0)ను జస్ప్రీత్ బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయడంతో దక్షిణాఫ్రికా తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. అయితే గాయం కారణంగా కెప్టెన్ టెంబా బావుమా బ్యాటింగ్‌కు రాలేదు. దీంతో 408 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ ముగిసింది. దక్షిణాఫ్రికా తరఫున డీన్ ఎల్గర్ తొలి ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 185 పరుగులు చేశాడు. మార్కో జెన్సన్ 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. డేవిడ్ బెడింగ్‌హామ్ 56 పరుగులు చేశారు. టోనీ డి జార్జి 28 పరుగులతో, గెరాల్డ్ కోయెట్జీ 19 పరుగులు చేశారు. భారత్ తరఫున జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు, మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీశారు. శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్‌ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్ తలా ఒక వికెట్‌ సాధించారు.

కాగా రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్ కు ఆదిలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. ఓపెనర్లు మళ్లీ విఫలమయ్యారు. కెప్టెన్‌ రోహిత్ శర్మ రబాడా బౌలింగ్‌లో డకౌట్‌ కాగా, మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ఐదు పరుగులు చేసి పెవిలియన్‌ చేరుకున్నాడు. భారత జట్టు ఇంకా 145 పరుగుల వెనకంజలో ఉంది. శుభ్‌మన్‌ గిల్‌ (13), విరాట్‌ కోహ్లీ (0) క్రీజులో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

రోహిత్ డకౌట్..

రెండు జట్ల XI ప్లేయింగ్

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): డీన్ ఎల్గర్, ఐడాన్ మార్క్రామ్, టోనీ డి జోర్జి, టెంబా బావుమా (కెప్టెన్), కీగన్ పీటర్సన్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ రెన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కగిసో రబడ, నాండ్రే బెర్గర్

భారత్ (ప్లేయింగ్ ఎలెవన్): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..