IND vs SA: చేతులెత్తేసిన బ్యాటర్లు.. చిత్తుగా ఓడిన రోహిత్‌ సేన.. ఇన్నింగ్స్‌ 32 రన్స్‌ తేడాతో సఫారీల ఘన విజయం

టీమిండియా తల రాత ఏమీ మారలేదు. సౌతాఫ్రికా గడ్డపై పేలవమైన ప్రదర్శనను పునరావృతం చేసింది.  సెంచూరియన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్‌లో రోహిత్‌ సేన ఏకంగా ఇన్నింగ్స్‌ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. తద్వారా మూడు టెస్ట్‌ల సిరీస్‌లో ఆతిథ్య జట్టు 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

IND vs SA: చేతులెత్తేసిన బ్యాటర్లు.. చిత్తుగా ఓడిన రోహిత్‌ సేన.. ఇన్నింగ్స్‌ 32 రన్స్‌ తేడాతో సఫారీల ఘన విజయం
India Vs South Africa
Follow us
Basha Shek

|

Updated on: Dec 28, 2023 | 9:22 PM

టీమిండియా తల రాత ఏమీ మారలేదు. సౌతాఫ్రికా గడ్డపై పేలవమైన ప్రదర్శనను పునరావృతం చేసింది.  సెంచూరియన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్‌లో రోహిత్‌ సేన ఏకంగా ఇన్నింగ్స్‌ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. తద్వారా మూడు టెస్ట్‌ల సిరీస్‌లో ఆతిథ్య జట్టు 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. . ఓవర్‌ నైట్‌ స్కోరు 256/5తో మూడో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 408 పరుగులకు ఆలౌటైంది. భారత్‌పై 163 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆటగాళ్లు క్రీజులో నిలవలేకపోయారు. అందరూ సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. దీంతో టీమిండియా 131 పరుగులకు ఆలౌట్‌ అయింది. కోహ్లీ (76) ఒంటరిపోరాటం మినహా.. 8 మంది బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పెవిలియన్‌ చేరారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో బర్గర్‌ 4 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. అలాగే మార్కొ జాన్సెన్‌ 3 వికెట్లు, రబాడ 2 వికెట్లు తీశారు. అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 245 పరుగులకు ఆలౌట్‌ అయిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులు చేసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో మరింత దారుణంగా ఉండి కేవలం 131 పరుగులకే ఆలౌటైంది.  మొదట బ్యాటింగ్ చేసిన తర్వాత, టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేస్తుందని భావించారు, కానీ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్‌ల జోడి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలమైంది. రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 5 పరుగులు మాత్రమే చేయగా, యశస్వి జైస్వాల్ 17 పరుగులు చేశాడు.  ఈ పరాజయంతో ప్రపంచ టెస్ట్ చాంఫియన్ షిప్ లో భారత్ ఐదో స్థానానికి పడిపోయింది. 100 విజయాల శాతంతో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో నిలిచింది. పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫలితం లేకపోవడంతో పాకిస్థాన్ నంబర్ టూ స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. భారత్ విజయాల శాతం 67 నుంచి 44.44 శాతానికి తగ్గింది. తద్వారా ఐదో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా 41.67 శాతంతో ఆరో స్థానంలో, వెస్టిండీస్ 16.67 శాతంతో ఏడో స్థానంలో, ఇంగ్లండ్ 15 శాతంతో ఎనిమిదో స్థానంలో ఉన్నాయి.

విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..