IND vs SA Series: ఐపీఎల్ ముగియడంతో టీమిండియా మళ్లీ తన జెర్సీతో మైదానంలోకి దిగనుంది. దక్షిణాఫ్రికా జట్టుతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు రంగం సిద్ధమైంది. తొలి టీ20 మ్యాచ్ న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జూన్ 9న జరగనుంది. దీంతో ఇరు జట్లు ఇప్పటికే ప్రాక్టీస్‌లో మునిగితేలుతున్నాయి. కాగా ఈ మ్యాచ్ కోసం టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) తన ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటించాడు. ఐపీఎల్‌లో అంతగా రాణించని ఆల్‌రౌండర్ అయిన వెంకటేష్ అయ్యర్‌కు తన స్క్వాడ్‌లో రవిశాస్త్రి చోటు కల్పించలేదు. ఇది పెద్దగా ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. అయితే ఈ మధ్య భీకర ఫామ్‌లో ఉండి ఫినిషర్‌గా అదరగొడుతోన్న దినేష్ కార్తీక్‌కు కూడా తన ప్లేయింగ్-XI లో చోటు కల్పించకపోవడం కాస్త ఆశ్చర్యమనిపిస్తోంది. ఇక తన జట్టులో కెప్టెన్ కేఎల్ రాహుల్, సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌లను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు. మరో ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా కాకుండా వన్‌డౌన్‌లో ఎంపిక చేయడం.
అతనే కీలక ప్లేయర్..
ఇక గుజరాత్ టైటాన్స్‌కు అరంగేట్రంలోనే ఐపీఎల్ ట్రోఫీ అందించిన హార్దిక్ పాండ్యాను తన ప్లేయింగ్ 11లో కీలకమైన ప్లేయర్‌గా రవిశాస్త్రి పేర్కొన్నాడు. అతనితో పాటు అక్షర్ పటేల్‌కు ఆల్‌రౌండర్ల కోటాలో స్థానం కల్పించాడు. ఇక 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను, అయిదో స్థానంలో రిషబ్ పంత్‌ను, ఆరో స్థానంలో హార్దిక్ పాండ్యాను ఎంపిక చేశాడు.బౌలింగ్ విభాగంలో అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్‌లను రవిశాస్త్రి ఎంచుకున్నాడు. అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ లలో ఎవరినైనా అదనపు బౌలర్‌గా అవకాశం కల్పించాడు. మీడియం పేసర్ మరియు స్పెషలిస్టు బౌలర్‌గా ను ఎంచుకున్నాడు.
రవిశాస్త్రి ప్లేయింగ్-XI:
కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్/ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్.
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read:
Salman Khan: బాలీవుడ్ భాయ్‌జాన్‌కు బెదిరింపు లేఖ.. సిద్ధూలానే హతమారుస్తామంటూ..
ENG vs NZ: కెప్టెన్సీ పోయినా రికార్డుల్లో తగ్గేదేలే అంటోన్న రూట్.. ఆ దిగ్గజ ఆటగాడి సరసన చోటు..