IND vs SA ODI Series : రోహిత్‌కు సెలెక్టర్లు కెప్టెన్సీ ఆఫర్ నిజంగానే ఇచ్చారా ? తనే కేఎల్ రాహుల్ అప్పజెప్పమని చెప్పాడా ?
భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం టీమ్‌ను అధికారికంగా ప్రకటించారు. దీంతో చాలా రోజులుగా జరుగుతున్న కెప్టెన్సీ చర్చలకు తెరపడింది. శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ వంటి కీలక ఆటగాళ్లకు గాయాలు కావడంతో టీమ్‌ను ఎవరు నడిపిస్తారు అనే ప్రశ్న వచ్చింది.

IND vs SA ODI Series : భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం టీమ్‌ను అధికారికంగా ప్రకటించారు. దీంతో చాలా రోజులుగా జరుగుతున్న కెప్టెన్సీ చర్చలకు తెరపడింది. శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ వంటి కీలక ఆటగాళ్లకు గాయాలు కావడంతో టీమ్‌ను ఎవరు నడిపిస్తారు అనే ప్రశ్న వచ్చింది. ఈ సమయంలో రోహిత్ శర్మకు సెలెక్టర్లు మళ్లీ కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చారని, కానీ ఆయన నిరాకరించారని సోషల్ మీడియాలో ఒక పుకారు మొదలైంది.
సోషల్ మీడియాలో వచ్చిన పుకార్ల ప్రకారం.. సెలెక్షన్ కమిటీ రోహిత్ శర్మను సంప్రదించి, సౌతాఫ్రికా వన్డే సిరీస్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోవాలని కోరింది. కానీ రోహిత్ ఆ ఆఫర్‌ను తిరస్కరించారట. అయితే బీసీసీఐ సెలెక్టర్ల నుంచి రోహిత్‌కు అలాంటి ప్రతిపాదన ఏదీ రాలేదు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీ ఈ వన్డే సిరీస్‌కు కెప్టెన్సీ బాధ్యతను కేఎల్ రాహుల్కే అప్పగించాలని మొదటి నుంచీ స్పష్టంగా ఉంది. సోషల్ మీడియాలో వచ్చిన ఆ వార్తలు కేవలం కొన్ని ఫ్యాన్ పేజీల ఊహాగానాలు మాత్రమే అని, దానికి ఎలాంటి అధికారిక ఆధారం లేదని తేలింది.
నవంబర్ 23న ప్రకటించిన టీమ్‌లో కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. రాహుల్ కెప్టెన్సీ, వికెట్ కీపింగ్, మిడిల్ ఆర్డర్‌లో స్థిరమైన బ్యాటింగ్‌తో టీమ్‌కు మంచి బ్యాలెన్స్ ఇస్తారు. శుభ్‌మన్ గిల్ మెడ గాయంతో, శ్రేయస్ అయ్యర్ ఆస్ట్రేలియా పర్యటనలో అయిన గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నారు. అయినప్పటికీ సెలెక్టర్లు కెప్టెన్సీ గురించి ఎలాంటి సందేహం లేకుండా కేఎల్ రాహుల్నే ఎంచుకున్నారు.
వన్డే సిరీస్ షెడ్యూల్, స్క్వాడ్
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఈ విధంగా ఉంది.
మొదటి వన్డే: నవంబర్ 30 – రాంచీ
రెండో వన్డే: డిసెంబర్ 3 – రాయ్‌పూర్
మూడో వన్డే: డిసెంబర్ 6 – విశాఖపట్నం
సౌతాఫ్రికాపై భారత స్క్వాడ్: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్ కీపర్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ధ్రువ్ జురెల్.
