AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA Final: ‘ఈసారి వదలొద్దు’.. మరికాసేపట్లో ఫైనల్ ఫైట్.. టీమిండియా గెలవాలని ప్రత్యేక పూజలు, ప్రార్థనలు

17 ఏళ్ల కిందట ఊహించని విధంగా ధోనీసేన ఒళ్లో వాలి, తర్వాత ఎన్నిసార్లు ప్రయత్నించినా దొరకని ట్రోఫీ.. ఇప్పుడు రోహిత్‌సేనను ఊరిస్తోంది. కాసేపట్లో భారత్‌, సౌతాఫ్రికా మధ్య తుది సమరం జరగనుంది. భారత్ రెండోసారి పొట్టికప్‌ను ముద్దాడుతుందా....? లేక ఫస్ట్ టైమ్ ఫైనల్ చేరిన సౌతాఫ్రికా కొత్త చరిత్ర సృష్టిస్తుందా....? అన్న సస్పెన్స్‌కు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.

IND vs SA Final: 'ఈసారి వదలొద్దు'.. మరికాసేపట్లో ఫైనల్ ఫైట్.. టీమిండియా గెలవాలని ప్రత్యేక పూజలు, ప్రార్థనలు
IND vs SA Final, T20 World Cup 2024
Basha Shek
|

Updated on: Jun 29, 2024 | 6:05 PM

Share

17 ఏళ్ల కిందట ఊహించని విధంగా ధోనీసేన ఒళ్లో వాలి, తర్వాత ఎన్నిసార్లు ప్రయత్నించినా దొరకని ట్రోఫీ.. ఇప్పుడు రోహిత్‌సేనను ఊరిస్తోంది. కాసేపట్లో భారత్‌, సౌతాఫ్రికా మధ్య తుది సమరం జరగనుంది. భారత్ రెండోసారి పొట్టికప్‌ను ముద్దాడుతుందా….? లేక ఫస్ట్ టైమ్ ఫైనల్ చేరిన సౌతాఫ్రికా కొత్త చరిత్ర సృష్టిస్తుందా….? అన్న సస్పెన్స్‌కు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. వెస్టీండీస్‌లోని గయాలో ఈ పొట్టి కప్‌ కోసం గట్టి ఫైట్‌ జరగనుంది. 2007లో తొలి టీ20 ప్రపంచకప్‌లో అనూహ్యంగా విజేతగా నిలిచిన భారత్‌.. రెండోసారి పొట్టి కప్పును ఒడిసిపట్టాలని పట్టుదలతో ఉంది. ఇక వన్డేల్లో కానీ, టీ20ల్లో కానీ దక్షిణాఫ్రికా ఫైనల్‌ చేరడం ఇదే తొలిసారి. టైటిల్‌ గెలవడానికి లేక లేక వచ్చిన ఈ అవకాశాన్ని వదులకోకూడదని సఫారీ జట్టు చూస్తోంది. టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా జైత్రయాత్ర కొనసాగిస్తూ ఫైనల్‌కు చేరింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి జట్లపై ప్రతీకారం తీర్చుకుని మరీ పదేళ్ల తర్వాత ఫైనల్లో అడుగు పెట్టింది. వన్డే వరల్డ్ కప్ చేజారడంతో పొట్టి ప్రపంచకప్ సాధించాలని భారత్ పట్టుదలతో ఉంది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది రోహిత్‌ సేన.

టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు టీమ్ ఇండియా చేరుకోవడంలో కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య కీ రోల్‌ ప్లే చేశారు. టోర్నీ మొత్తం ఇద్దరూ జట్టును ముందుండి నడిపించారు. రోహిత్ ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడి 248 పరుగులు చేసి భారత్ తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్నాడు. అలాగే పాండ్య అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లోనూ అదిరిపోయే ఫర్ఫార్మెన్స్‌ ఇస్తున్నాడు. 139 రన్స్‌తో పాటు 8 వికెట్లు తీసి జట్టు విజయాలకు కృషి చేశారు. ఈసారి దక్షిణాఫ్రికా చాలా బలంగా కనబడుతోంది. సెమీస్‌ వరకు హేమాహేమీ టీమ్‌లతో తలపడి నాకౌట్‌కు చేరింది. సెమీస్‌లో మాత్రం పెద్దగా కష్టపడకుండా అఫ్గాన్‌పై సులువుగానే విజయం సాధించి టైటిల్‌ తుది పోరుకు వచ్చింది. ఈసారి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల లిస్ట్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఒక్కరు కూడా టాప్‌-5లో లేరు. కానీ, ఆ జట్టు సమష్టిగా రాణించి విజయాలు సాధించింది. సూపర్‌-8లోనే బలమైన విండీస్‌, ఇంగ్లాండ్‌ను అలవోకగా చిత్తు చేసింది. కాబట్టి తక్కువ అంచనా వేయలేం.

ఇవి కూడా చదవండి

స్పిన్ కు అనుకూలం..

క్వింటన్ డికాక్‌ సౌతాఫ్రికా జట్టు తరఫున అత్యధిక పరుగులు చేశాడు. మిగతావారూ తలో చేయి వేసి మద్దతుగా నిలుస్తున్నారు. మార్‌క్రమ్, హెండ్రిక్స్‌, క్లాసెన్, మిల్లర్, స్టబ్స్‌తో భారత బౌలర్లకు సవాల్ తప్పదు. టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా బౌలర్లు అదరగొట్టేస్తున్నారు. నోకియా , రబాడ , షంసీ ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు.కొత్త బౌలర్‌ బార్ట్‌మన్‌ కూడా జోరుమీదున్నాడు.అలాగే షంసీ కీలక సమయంలో వికెట్లు తీస్తున్నాడు. విండీస్‌ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో అతను అదరగొడుతున్నారు. అతడిని ఎదుర్కోవడం టీమిండియాకు కాస్త కష్టంగానే ఉంటుందని చెప్పొచ్చు. ఇక మన జట్టులో కుల్‌దీప్‌ కూడా ఇలాంటి ప్రదర్శనే చేస్తున్నాడు.

టీమిండియా గెలవాలని..

మొత్తంగా… కాసేపట్లో జరగబోయే ఫైనల్‌ ఫైట్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఆకస్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా క్రికెట్‌ ఫీవర్‌ నడుస్తోంది. క్రికెట్ అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత్ గెలవాలని హారతి ఇచ్చారు. భార‌త సార‌ధి రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫొటోలు, జాతీయ జెండాలు పట్టుకొని ‘జై హింద్’ అంటూ నినాదాలు చేశారు. ఆట‌గాళ్ల‌ ఫొటోలు ప్రదర్శిస్తూ మేళతాళాలతో భజన కూడా చేశారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..