
India vs Pakistan, 12th Match: అహ్మదాబాద్‌లో పాకిస్థాన్‌తో జరుగుతోన్న వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో మైలురాయిని చేరుకున్నాడు. ఈమ్యాచ్‌లో 3 సిక్సులు కొట్టిన తర్వాత 300 వన్డే సిక్సర్లు బాదిన మూడో బ్యాటర్‌గా భారత కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచాడు.
పాకిస్థాన్ బ్యాటర్ షాహిద్ అఫ్రిది వన్డే క్రికెట్‌లో తన పేరుతో 351 సిక్సులతో అగ్రస్థానంలో నిలిచాడు. 50 ఓవర్ల క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ల జాబితాలో అఫ్రిదీ తర్వాతి స్థానంలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ ఉన్నాడు.
రోహిత్ T20I లలో సిక్సర్ల చార్ట్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇటీవలే పొట్టి ఫార్మాట్‌లలో అత్యధిక సిక్సర్‌లను బాదిన గేల్‌ను అధిగమించాడు.
1. షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్) – సిక్స్‌లు: 351 , మ్యాచ్‌లు: 398, పరుగులు: 8064, అత్యధిక స్కోర్: 124, స్ట్రైక్ రేట్: 117.00
2. క్రిస్ గేల్ (వెస్టిండీస్) -సిక్స్: 331 , మ్యాచ్‌లు: 301, పరుగులు: 10480, అత్యధిక స్కోర్: 215, స్ట్రైక్ రేట్: 81.19
3. రోహిత్ శర్మ (భారతదేశం) – సిక్స్‌లు: 301* , మ్యాచ్‌లు: 254, పరుగులు: 10265, అత్యధిక స్కోర్: 264, స్ట్రైక్ రేట్: 91.01
4. సనత్ జయసూర్య (శ్రీలంక) – సిక్స్‌లు: 270 , మ్యాచ్‌లు: 445, పరుగులు: 13430, అత్యధిక స్కోర్: 189, స్ట్రైక్ రేట్: 91.20
5. ఎంఎస్ ధోని (భారతదేశం) – సిక్స్‌లు: 229 , మ్యాచ్‌లు: 350, పరుగులు: 10773, అత్యధిక స్కోర్: 183*, స్ట్రైక్ రేట్: 87.56.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్.
మరిన్న క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..