AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK Asia Cup: పాక్ పై భారత్ విజయం.. ప్రపంచ వ్యాప్తంగా అంబరాన్ని తాకిన భారతీయుల సంబరాలు

దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఒకానొక దశలో మ్యాచ్‌ గెలుస్తామా అన్న డౌట్‌ నుంచి.. హార్థిక పాండ్యా సిక్సర్‌ కొట్టి గెలిపించే వరకు రోలర్‌ కోస్టర్‌ రైడ్‌లా సాగింది. కోట్లాది మంది అభిమానులు ఈ విజయాన్ని అద్భుతంగా సెలబ్రేట్‌ చేసుకున్నారు.

IND vs PAK Asia Cup:  పాక్ పై భారత్ విజయం.. ప్రపంచ వ్యాప్తంగా అంబరాన్ని తాకిన భారతీయుల సంబరాలు
Indians Celebrations
Surya Kala
|

Updated on: Aug 29, 2022 | 8:47 AM

Share

IND vs PAK: గతేడాది టీ20 వరల్డ్‌ కప్‌ ఓటమికి అచ్చంగా ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. దాయాది పాకిస్తాన్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో దారుణ ఓటమికి.. ఇప్పుడు పర్ఫెక్ట్‌ ఆన్సర్‌ ఇచ్చింది. ఫస్ట్‌ బ్యాటింగ్‌కి దిగిన పాక్‌ని ఓ ఆటాడుకున్నారు బౌలర్లు. ముఖ్యంగా భువి, పాండ్యా తమ సత్తా చాటారు. రిజ్వాన్‌ తప్ప.. ఇంకెవర్నీ నిలదొక్కుకోనివ్వలేదు మన బౌలర్లు. భువి పాకిస్తాన్‌పై బెస్ట్‌ ఫిగర్స్‌ నమోదు చేశాడు. 26 పరుగులకు 4 వికెట్లు తీస్తే.. కీలక సమయాల్లో చెలరేగిన పాండ్యా 24 రన్స్‌ ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో పాక్‌ 19.5 ఓవర్లలో 147కి ఆలౌట్‌ అయింది.

టార్గెట్‌ చేజింగ్‌లో భారత్‌ ఆదిలోనే రాహుల్‌ వికెట్‌ కోల్పోయింది. అయితే రోహిత్‌, కోహ్లీ ఆదుకున్నారు.కోహ్లీ 34 బంతుల్లో 35పరుగులు చేశాడు. ఇందులో ఓ సిక్స్‌, మూడు ఫోర్లున్నాయి. కాని కీలక సమయంలో ఈ ఇద్దరూ ఔటయ్యారు. అప్పుడు బరిలో దిగిన జడేజా, పాండ్యా పాకిస్తాన్‌కి చుక్కలు చూపించారు. జడేజా పిచ్‌కి తగ్గట్లుగా ఆడుతూ వచ్చాడు. కాని పాండ్యా వేగంగా పరుగులు సాధించేందుకు మొగ్గు చూపాడు. జడేజా 29 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్సులు, రెండు ఫోర్లున్నాయి. చివరి ఓవర్లో జడేజా భారీ షాట్‌ కొడదామని యత్నించి.. ఫస్ట్‌ బాల్‌కే ఔటయ్యాడు. రెండో బంతికి సింగిల్‌ వచ్చింది. మూడో బాల్‌ తగల్లేదు. ఇంకా మూడు బాల్స్‌లో ఆరు పరుగులు చేయాలి. ఈ సమయంలో పాండ్యా అంతా నేను చూసుకుంటానన్న సిగ్నల్‌ ఇచ్చాడు. తర్వాతి బాల్‌కి భారీ సిక్సర్‌ కొట్టడంతో.. ఒక్కసారిగా స్డేడియం దగ్గరిల్లింది..

అక్కడే కాదు.. భారతావని మొత్తం మురిసింది. దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఒకానొక దశలో మ్యాచ్‌ గెలుస్తామా అన్న డౌట్‌ నుంచి.. హార్థిక పాండ్యా సిక్సర్‌ కొట్టి గెలిపించే వరకు రోలర్‌ కోస్టర్‌ రైడ్‌లా సాగింది. కోట్లాది మంది అభిమానులు ఈ విజయాన్ని అద్భుతంగా సెలబ్రేట్‌ చేసుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే వాతావరణం కనిపించింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో యువత సంబరాలు అంబరాన్నంటాయి. నెక్లెస్‌ రోడ్‌, ట్యాంక్‌బండ్‌ పరిసరాలు మొత్తం టీమిండియా ఫ్యాన్స్‌తో నిండిపోయాయి.

సంబరాలు ఇక్కడే కాదు.. అమెరికాలోనూ కనిపించాయి. మైక్రోసాఫ్ట్‌ రెడ్మండ్‌ క్యాంపస్‌లో మనోళ్లు ఫుల్లుగా ఎంజాయ్‌ చేశారు. లాస్ట్‌ సిక్స్‌ తర్వాత అక్కడున్న మనోళ్ల ఆనందానికి అవధులే లేకుండా పోయాయి.

అటు ఇంటర్నెట్‌లోనూ అనేక రకాల మీమ్స్‌ చక్కర్లు కొట్టాయి. మన ఆటగాళ్లు డ్యాన్సులు చేస్తున్నట్లుగా వీడియోలను షేర్‌ చేశారు అభిమానులు. పాక్‌పై అద్భుత విజయం సాధించడంతో.. టీమిండియాపై ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ, రాహుల్‌ గాంధీ, హోంమంత్రి అమిత్‌షా శుభాకాంక్షలు ప్రకటించారు. అయితే ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షో చేసిన హార్దిక పాండ్యాకి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ లభించింది. భారత్‌ తర్వాతి మ్యాచ్‌ హాంకాంగ్‌తో ఎల్లుండి తలపడనుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..