IND vs NZ: జడేబా ‘పాంచ్’ పటాకా.. మళ్లీ సుందర్ మ్యాజిక్.. తక్కువ స్కోరుకే న్యూజిలాండ్ ఆలౌట్

|

Nov 01, 2024 | 3:37 PM

ముంబై టెస్టులో టీమిండియా స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తమ బంతులతో న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. క్రమం తప్పకుండా వికెట్లు తీసి ఆజట్టును తక్కువ స్కోరుకే ఆలౌట్ చేశారు.

IND vs NZ: జడేబా పాంచ్ పటాకా.. మళ్లీ సుందర్ మ్యాజిక్.. తక్కువ స్కోరుకే న్యూజిలాండ్ ఆలౌట్
India Vs New Zealand
Follow us on

ముంబైతో జరుగుతోన్న మూడు టెస్టులో న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకే కుప్పకూలింది. ఈ ఇన్నింగ్స్‌లో డారిల్ మిచెల్ అత్యధికంగా 82 పరుగులు చేశాడు. అతనితో పాటు, విల్ యంగ్ కూడా 71 పరుగులు చేయగలిగాడు. భారత్ తరఫున ఈ ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా అత్యధికంగా 5 వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్ కూడా 4 వికెట్లు పడగొట్టగా, ఆకాశ్ దీప్ ఒక వికెట్ తీశాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ శుభారంభాన్ని అందుకుంది. అయితే జట్టు స్కోరు 15 వద్ద ఉండగా ఓపెనర్ డెవాన్ కాన్వే ను  ఆకాష్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. అనంతరం కెప్టెన్ టామ్ లాథమ్, విల్ యంగ్ 44 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ సమయంలో చెలరేగిన వాషింగ్టన్ సుందర్.. కెప్టెన్ టామ్ లాథమ్‌ను అవుట్ చేయడం ద్వారా ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. దీని తర్వాత ఇన్ ఫామ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర ఎక్కువసేపు మైదానంలో నిలవకుండా సుందర్ వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో సుందర్ వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో రచిన్‌ను మూడోసారి ఔట్ చేశాడు.

 

ఇవి కూడా చదవండి

మిచెల్ ఒంటరి పోరాటం

రచిన్ ఔటైన తర్వాత, యంగ్ నాలుగో వికెట్‌కు డారిల్ మిచెల్‌తో కలిసి 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ సమయంలో, యంగ్ తన టెస్ట్ కెరీర్‌లో ఎనిమిదో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. రవీంద్ర జడేజా ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. కివీస్ ఇన్నింగ్స్ 44వ ఓవర్లో జడేజా రెండు వికెట్లు తీశాడు. తొలుత యంగ్ వికెట్ తీసిన జడేజా.. ఆ తర్వాత టామ్ బ్లండెల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. యంగ్ 71 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, బ్లండెల్ తన ఖాతాను కూడా తెరవలేకపోయాడు. దీని తర్వాత గ్లెన్ ఫిలిప్స్‌ను కూడా జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు.

 

దీని తర్వాత జడేజా ఈ ఇన్నింగ్స్‌లో రెండోసారి ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీశాడు. కివీస్ ఇన్నింగ్స్ 61వ ఓవర్లో జడేజా తొలుత ఇష్ సోధి వికెట్ ను పడగొట్టి అదే ఓవర్లో మ్యాట్ హెన్రీని పెవిలియన్ కు పంపాడు. సోధీ ఎల్బీడబ్ల్యూ అవుట్ కాగా, హెన్రీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సోధీ ఏడు పరుగులు చేయగా, హెన్రీ ఖాతా తెరవలేకపోయాడు. చివరికి సుందర్ డారిల్ మిచెల్, అజాజ్ పటేల్ (7)లను వాషింగ్టన్ అవుట్ చేయడంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 235 పరుగులకు ముగిసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..