AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: 2.2 ఓవర్లలోనే 50 పరుగులు.. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన టీమిండియా

IND vs NZ: మూడో టీ20లో టీమిండియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. న్యూజిలాండ్ నిర్దేశించిన 199 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ అదరగొట్టారు. తొలి ఓవర్‌లోనే 26 పరుగులు చేసిన భారత్, కేవలం 14 బంతుల్లోనే 50 పరుగుల మార్కును దాటింది.

IND vs NZ: 2.2 ఓవర్లలోనే 50 పరుగులు.. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన టీమిండియా
Abhishek Sharma
Rakesh
|

Updated on: Oct 27, 2026 | 2:46 PM

Share

IND vs NZ: భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. 199 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఇన్నింగ్స్‌ను మెరుపు వేగంతో ప్రారంభించింది. తొలి ఓవర్‌లోనే ఏకంగా 26 పరుగులు సాధించింది. ఇందులో వైడ్లు, నోబాల్ పరుగులు కూడా ఉన్నాయి. వైభవ్ సూర్యవంశీ మొదటి బంతికే ఫోర్ కొట్టగా, అభిషేక్ శర్మ కూడా సిక్సర్‌తో తన దూకుడు చూపించాడు. దీంతో మ్యాచ్ ఆరంభం నుంచే న్యూజిలాండ్ బౌలర్లపై ఒత్తిడి పెరిగింది.

14 బంతుల్లోనే 50 పరుగులు

టీమిండియా దూకుడు రెండో ఓవర్‌లోనూ కొనసాగింది. వైభవ్, అభిషేక్ పోటాపోటీగా బౌండరీలు బాదడంతో భారత్ కేవలం 2.2 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును దాటింది. అంటే 14 బంతుల్లోనే జట్టు స్కోరు 50 దాటిందన్నమాట. మూడో ఓవర్ రెండో బంతికే భారత్ ఈ మైలురాయిని అందుకుంది. ఆ తర్వాత కూడా అభిషేక్ శర్మ సిక్సర్ బాదడంతో స్కోరు మరింత వేగంగా పెరిగింది. ఇంత తక్కువ సమయంలో జట్టు 50 పరుగులు చేయడం ఈ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

వైభవ్, అభిషేక్ విధ్వంసం

ఓపెనర్లుగా వచ్చిన వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ న్యూజిలాండ్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. వైభవ్ మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడగా, అభిషేక్ కూడా తనదైన శైలిలో సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. భారత ఇన్నింగ్స్‌లో తొలి రెండు ఓవర్లలోనే భారీగా పరుగులు రావడంతో లక్ష్యం తేలికవుతుందనే ఆశలు అభిమానుల్లో పెరిగాయి. మరోవైపు, ఇంత వేగంగా పరుగులు వస్తుండటంతో న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

భారత్ ముందు 199 పరుగుల లక్ష్యం

అంతకుముందు టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ 88 పరుగులతో అజేయంగా నిలిచి భారత బౌలర్లకు సవాల్ విసిరాడు. ఫిన్ అలెన్ 40 పరుగులు, బెవాన్ జాకబ్స్ 39 పరుగులు చేశారు. భారత్ తరఫున అర్ష్‌దీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు. దీంతో భారత్ ముందు 199 పరుగుల లక్ష్యం నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us