AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: కోహ్లీకి చెక్ పెట్టేందుకు ఇంగ్లండ్ మాస్టర్ ప్లాన్.. రంగంలోకి మిస్టరీ స్పిన్నర్‌.. రన్ మెషీన్‌కు బ్రేకులేస్తాడా?

India vs England: భారత్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ 16 మంది సభ్యులతో కూడిన జట్టులో అన్‌క్యాప్డ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ చోటు దక్కించుకున్నాడు. షోయబ్ బషీర్ ఈ ఏడాది జూన్‌లో 19 సంవత్సరాల వయస్సులో తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. చెమ్స్‌ఫోర్డ్‌లో సర్ అలెస్టర్ కుక్‌తో అగ్ని పరీక్షను ఎదుర్కొన్నాడు. సోమర్‌సెట్‌కు తొలిరోజు వికెట్లు పడనప్పటికీ, అతని నియంత్రణ, స్వభావం ఇంగ్లండ్ స్కౌట్స్‌తో సహా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

IND vs ENG: కోహ్లీకి చెక్ పెట్టేందుకు ఇంగ్లండ్ మాస్టర్ ప్లాన్.. రంగంలోకి మిస్టరీ స్పిన్నర్‌.. రన్ మెషీన్‌కు బ్రేకులేస్తాడా?
Ind Vs Eng Virat Kohli
Venkata Chari
|

Updated on: Jan 20, 2024 | 6:07 PM

Share

England Tour Of India, Shoaib Bashir: అనుభవజ్ఞుడైన జాక్ లీచ్ భారత పర్యటనకు వచ్చే ఇంగ్లండ్ జట్టుకు ప్రధాన స్పిన్నర్‌గా వ్యవహరించనున్నాడు. అదే సమయంలో, 20 ఏళ్ల అన్‌క్యాప్డ్ ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్‌పై కూడా ఓ కన్నేసి ఉంచనున్నట్లు మాంటీ పనేసర్ చెప్పుకొచ్చాడు. మాంటీ పనేసర్ 2012లో భారత్‌లో టెస్ట్ సిరీస్‌ను 2-1తో గెలుచుకున్న ఇంగ్లీష్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. జనవరి 26 నుంచి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.

తొలిసారి భారత్‌లో ఆడనున్న మిస్టరీ స్పిన్నర్ షోయబ్ బషీర్..

భారత్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ 16 మంది సభ్యులతో కూడిన జట్టులో అన్‌క్యాప్డ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ చోటు దక్కించుకున్నాడు. షోయబ్ బషీర్ ఈ ఏడాది జూన్‌లో 19 సంవత్సరాల వయస్సులో తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. చెమ్స్‌ఫోర్డ్‌లో సర్ అలెస్టర్ కుక్‌తో అగ్ని పరీక్షను ఎదుర్కొన్నాడు. సోమర్‌సెట్‌కు తొలిరోజు వికెట్లు పడనప్పటికీ, అతని నియంత్రణ, స్వభావం ఇంగ్లండ్ స్కౌట్స్‌తో సహా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంచెలంచెలుగా వచ్చిన అవకాశాలతో చాలాసార్లు తానేంటో నిరూపించుకున్నాడు.

విరాట్ కోహ్లీకి ముప్పుగా మారనున్న షోయబ్ బషీర్..

షోయబ్ బషీర్ కౌంటీ క్రికెట్‌లో వైవిధ్యభరితమైన అనుభవం భారత దిగ్గజాలకు, ముఖ్యంగా విరాట్ కోహ్లి, శుబ్‌మాన్ గిల్‌లకు సమస్యగా మారుతుందని మాంటీ పనేసర్ అభిప్రాయపడ్డాడు. మాంటీ పనేసర్ మాట్లాడుతూ, ‘షోయబ్ బషీర్ ఉత్తమ బౌలర్ అని నేను నమ్ముతున్నాను. అతను ఖచ్చితంగా భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందులకు గురిచేస్తాడు. భారత ఎర్ర మట్టి టర్నింగ్ ట్రాక్‌లు అతనికి డ్రీమ్ పిచ్ అవుతుంది.

షోయబ్ బషీర్‌ను నిశితంగా పరిశీలిస్తోన్న పనేసర్..

మాంటీ పనేసర్ మాట్లాడుతూ, ‘నేను అతనిని కలిశాను. నేను అతనిని ఇంగ్లండ్‌లో కొన్ని సార్లు దగ్గరగా చూశాను. అతనికి అసాధారణమైన ప్రతిభ ఉందని నేను నమ్ముతున్నాను. అతని హై-ఆర్మ్ యాక్షన్‌తో, బ్యాట్స్‌మన్‌ని ముందుకు వచ్చేలా లేదా స్లిప్, గల్లీ ద్వారా కట్ చేయమని బలవంతం చేస్తాడు. ఒకే విధమైన ఆట స్వభావం కలిగిన విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్‌లపై అతను పైచేయి సాధిస్తాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..