IND vs ENG : కరోనా నుంచి పూర్తిగా కోలుకోని రోహిత్.. ఇంగ్లండ్‌తో టెస్టుకు టీమిండియా కెప్టెన్‌ ఎవరంటే..?

IND vs ENG 5th Test: ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్ వేదికగా జులై 1 (శుక్రవారం) నుంచి ప్రారంభంకానున్న ఐదో టెస్టుకి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma) దూరంకానున్నాడని తెలుస్తోంది.

IND vs ENG : కరోనా నుంచి పూర్తిగా కోలుకోని రోహిత్.. ఇంగ్లండ్‌తో టెస్టుకు టీమిండియా కెప్టెన్‌ ఎవరంటే..?
Indian Cricket Team

Edited By: Ravi Kiran

Updated on: Jun 30, 2022 | 7:15 AM

IND vs ENG 5th Test: ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్ వేదికగా జులై 1 (శుక్రవారం) నుంచి ప్రారంభంకానున్న ఐదో టెస్టుకి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma) దూరంకానున్నాడని తెలుస్తోంది. గత వారం లీసెస్టర్ టీమ్‌తో జరిగిన నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌లోఅతనికి కరోనా సోకింది. దీంతో ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంటున్నాడు.. గురువారం మరోసారి అతనికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే శుక్రవారం నాటికి రోహిత్‌ కోలుకోవడం కష్టమే. ఈ నేపథ్యంలో.. ఐదో టెస్టుకి కెప్టెన్సీ బాధ్యతల్ని జస్‌ప్రీత్ బుమ్రాకి (Jasprit Bumrah) అప్పగించవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే టీమిండియా మేనేజ్‌‌మెంట్ నిర్ణయం తీసుకుంది, బుమ్రాకు కూడా సమాచారం చేరేవేశారని తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే.. కపిల్‌దేవ్ తర్వాత భారత టెస్టు జట్టుని నడిపించబోతున్న రెండో ఫాస్ట్ బౌలర్‌గా బుమ్రా నిలవనున్నాడు.

కాగా రోహిత్‌ ఆరోగ్యం విషయంపై బీసీసీఐ నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేకపోవడంతో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్ ఎవరనే అంశంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కొందరు పంత్‌ అంటే, మరికొందరు అశ్విన్‌ అంటూ సోషల్‌ మీడియాను హోరెత్తించారు. ఈనేపథ్యంలో రూమర్లకు చెక్‌ పెడుతూ బీసీసీఐ బుమ్రాకు సారథ్య బాధ్యతలు అప్పగించిందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా గతేడాది జరిగిన ఇండియా-ఇంగ్లండ్ సిరీస్ లో ఇప్పటికే భారత జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ టెస్టు డ్రా అయినా టీమిండియాకు పోయేదేం లేదు. గెలిచినా,డ్రా అయినా సిరీస్ మన సొంతం కానుంది. అయితే ఓడితే మాత్రం సిరీస్ సమం అవుతుంది. ఈ రీషెడ్యూల్‌ టెస్టు తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ తో మూడు వన్డేలు, 3 టీ20లు ఆడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..