IND vs ENG: ఫీల్డింగ్‌కు రాని రోహిత్ శర్మ.. బుమ్రాకు కెప్టెన్సీ.. కారణమిదే.. ఫ్యాన్స్‌లో ఆందోళన

|

Mar 09, 2024 | 1:08 PM

ధర్మశాల వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతోన్న ఐదో టెస్టు మ్యాచ్ లోనూ భారత్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. ప్రస్తుతం టీమిండయా జోరు చూస్తుంటే మూడో రోజే విజయం గెలిచేలా ఉంది. ఇలాంటి సంతోషకరమైన సమయంలో ఒక వార్త టీమిండియా అభిమానులను కలవరానికి గురిచేసింది. అదేంటంటే.. మూడో రోజు ఆటలో కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ కు రాలేదు. వైస్ కెప్టెన్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్య బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. దీంతో క్రీడాభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

IND vs ENG: ఫీల్డింగ్‌కు రాని రోహిత్ శర్మ.. బుమ్రాకు కెప్టెన్సీ.. కారణమిదే.. ఫ్యాన్స్‌లో ఆందోళన
Rohit Sharma
Follow us on

ధర్మశాల వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతోన్న ఐదో టెస్టు మ్యాచ్ లోనూ భారత్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. ప్రస్తుతం టీమిండయా జోరు చూస్తుంటే మూడో రోజే విజయం గెలిచేలా ఉంది. ఇలాంటి సంతోషకరమైన సమయంలో ఒక వార్త టీమిండియా అభిమానులను కలవరానికి గురిచేసింది. అదేంటంటే.. మూడో రోజు ఆటలో కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ కు రాలేదు. వైస్ కెప్టెన్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్య బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. దీంతో క్రీడాభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇంత హఠాత్తుగా జస్ప్రీత్ బుమ్రాకు కెప్టెన్సీ అప్పగించడానికి కారణం ఏమిటి? అసలు రోహిత్ శర్మకు ఏమైంది? అనే ప్రశ్నలు అభిమానుల మదిలో మెదిలాయి. ఆ తర్వాత కొద్ది సేపటికే మూడో రోజు రోహిత్ శర్మ మైదానంలోకి రాలేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇందుకు కారణం అతను వెన్నునొప్పితో బాధపడుతున్నాడనే విషయాన్ని కూడా తెలిపింది. దీంతో రోహిత్ శర్మ అభిమానుల్లో టెన్షన్ పెరిగింది. ఎందుకంటే ధర్మశాల టెస్టు మ్యాచ్‌ తర్వాత ఐపీఎల్‌ పోరు ప్రారంభమవుతుంది. ఇలాంటి సమయంలో రోహిత్ శర్మ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడనే విషయం విని అతని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

ఐపీఎల్ ప్రారంభానికి కేవలం పన్నెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. తొలి మ్యాచ్‌ లో ముంబై ఇండియన్స్ గుజరాత్ జెయింట్స్ తో తలపడనుంది.ఈ మ్యాచ్ మార్చి 24న జరగనుంది. అప్పటికి రోహిత్ శర్మ కోలుకుంటాడా? అన్న అనుమానం అభిమానులను కలవరపెడుతోంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ముంబై ఇండియన్స్ జట్టు తొలిసారిగా రంగంలోకి దిగనుంది. అతని నాయకత్వంలో బ్యాటింగ్‌కు దిగేందుకు రోహిత్ శర్మ కూడా రెడీ అయ్యాడు. అయితే సడెన్ గా ఇలా జరగడంతో ముంబై ఇండియన్స్‌ మేనేజ్ మెంట్ లో కూడా భయం పెరిగింది.

ఇవి కూడా చదవండి

బీసీసీఐ ట్వీట్ ఇదిగో..

 

రోహిత్ శర్మ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మరోసారి టీ20 బాధ్యతలు చేపట్టాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లోనూ సెంచరీ సాధించాడు. అదే సమయంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను కూడా కైవసం చేసుకున్నాడు. ఐదో టెస్టు మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. 162 బంతుల్లో 103 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్‌తో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తలు, కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..