AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌.. రాజ్‌కోట్‌ స్టేడియంపేరు మార్పు.. ఎవరి పేరు పెట్టనున్నారంటే?

భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. మూడో టెస్టు ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌లో జరగనుంది. అయితే అంతకు ముందే స్టేడియం పేరు మారనుంది. రాజ్‌కోట్‌లోని కొత్త స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు జరగనుంది. ప్రస్తుతం రాజ్‌కోట్‌లోని స్టేడియానికి ఎలాంటి పేరు లేదు.

IND vs ENG: ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌.. రాజ్‌కోట్‌ స్టేడియంపేరు మార్పు.. ఎవరి పేరు పెట్టనున్నారంటే?
India Vs England
Basha Shek
|

Updated on: Feb 06, 2024 | 3:38 PM

Share

భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. మూడో టెస్టు ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌లో జరగనుంది. అయితే అంతకు ముందే స్టేడియం పేరు మారనుంది. రాజ్‌కోట్‌లోని కొత్త స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు జరగనుంది. ప్రస్తుతం రాజ్‌కోట్‌లోని స్టేడియానికి ఎలాంటి పేరు లేదు. ఇది దాని రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అంటే సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంగా మాత్రమే పిలుస్తున్నారు. అందిన సమాచారం ప్రకారం, రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంకు లెజెండరీ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ నిరంజన్ షా పేరు పెట్టనున్నారు. భారత్-ఇంగ్లండ్ మూడో టెస్టు ప్రారంభానికి ఒకరోజు ముందు క్రికెట్ స్టేడియానికి నిరంజన్ షా పేరు పెట్టనున్నారు. క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ కాకముందు, నిరంజన్ షా స్వయంగా క్రికెటర్. ఆయన 1965- 1975 మధ్య సౌరాష్ట్ర తరపున ఫస్ట్-క్లాస్ తరఫున క్రికెట్ ఆడాడు. ప్రస్తుతం నిరంజన్ షా సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నారు.

రాజ్‌కోట్‌లోని స్టేడియంలో భారత జట్టు టెస్ట్ రికార్డును పరిశీలిస్తే, భారత్ ఇక్కడ 2 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. అందులో 1 గెలిచింది, మరొకటి డ్రా అయింది. 2016లో ఇంగ్లండ్‌తో టీమిండియా ఆడిన టెస్టు డ్రా అయింది. 2018లో వెస్టిండీస్‌తో జరిగిన చివరి టెస్టులో ఆడి విజయం సాధించింది. హైదరాబాద్ వేదికగా జరిగిన టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. మూడో టెస్టు రాజ్‌కోట్‌లో జరగనుంది. నాలుగో టెస్టు రాంచీలో జరగనుండగా, 5వ, చివరి టెస్టు ధర్మశాలలో జరగనుంది.

ఇవి కూడా చదవండి

కీలకం కానున్న మూడో టెస్ట్

భారత జట్టుకు జైషా అభినందనలు..

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి