IND vs BAN: భారీ సిక్స్‌తో గోడ బద్దలు కొట్టిన కింగ్ కోహ్లీ.. బంగ్లాకు ఇక దబిడిదిబిడే.. వీడియో ఇదిగో

సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో టీమిండియా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌ కోసం భారత క్రికెటర్లు తీవ్రంగా సన్నద్ధమవుతున్నారు. ఈ సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఆడనున్నాడు. చాలా కాలం తర్వాత అతను మళ్లీ టెస్టు ఫార్మాట్‌లోకి రానున్నాడు

IND vs BAN: భారీ సిక్స్‌తో గోడ బద్దలు కొట్టిన కింగ్ కోహ్లీ.. బంగ్లాకు ఇక దబిడిదిబిడే.. వీడియో ఇదిగో
Virat Kohli
Follow us
Basha Shek

|

Updated on: Sep 16, 2024 | 12:38 PM

సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో టీమిండియా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌ కోసం భారత క్రికెటర్లు తీవ్రంగా సన్నద్ధమవుతున్నారు. ఈ సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఆడనున్నాడు. చాలా కాలం తర్వాత అతను మళ్లీ టెస్టు ఫార్మాట్‌లోకి రానున్నాడు. కోహ్లీ ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికాతో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. కాగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు విరాట్ ఈ మైదానం గోడను పగలగొట్టాడు. ఆదివారం (సెప్టెంబర్ 15) చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన భారత నెట్ సెషన్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు. కోహ్లి నెట్ సెషన్‌లో హైలైట్ ఏమిటంటే, భారత డ్రెస్సింగ్ రూమ్ సమీపంలోని చెపాక్‌లోని గోడను బద్దలు కొట్టాడు. వాస్తవానికి, ప్రాక్టీస్ సెషన్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, కోహ్లి కొట్టిన షాట్‌లలో ఒకటి డ్రెస్సింగ్ రూమ్‌కు సమీపంలో ఉన్న గోడకు తగిలింది. విరాట్ దెబ్బకు ఆ బాల్ డైరెక్ట్ గా వెళ్లి డ్రెస్సింగ్ రూమ్ గోడను బ్రేక్ చేసింది. దీంతో సహచర ప్లేయర్లు షాక్ కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు ‘ బంగ్లాకు ఇక దబిడిదిబిడే, బంగ్లా పులులకు తిప్పలు తప్పవు’ అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా దీనికి సంబంధించిన వీడియోను జియో సినిమా తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలోనే షేర్ చేసింది.

ప్రాక్టీస్ సెషన్‌లో చెమటోడ్చుతోన్న విరాట్ కోహ్లి టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో కూడా కాసేపు గడిపాడు. ఈ సందర్భంగా గంభీర్ కోహ్లీకి బ్యాటింగ్ చిట్కాలు ఇచ్చాడు. విరాట్ కోహ్లీ లండన్ నుండి నేరుగా చెన్నై చేరుకున్నాడు. తన తోటి ఆటగాళ్లతో కలిసి తీవ్రంగా సిద్ధమవుతున్నాడు. విరాట్ బంగ్లాదేశ్‌తో ఇప్పటివరకు 6 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలో, అతను 54.62 సగటుతో 437 పరుగులు చేశాడు, ఇందులో 2 సెంచరీలు కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

ఈ సిరీస్ లో విరాట్ కోహ్లి కూడా భారీ రికార్డుపై కన్నేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 27,000 పరుగులకు చేరువలో ఉన్నాడు. ఇప్పటి వరకు అతను 533 మ్యాచ్‌ల్లో 26,942 పరుగులు చేశాడు. దీంతో అరుదైన రికార్డుకు కేవలం 58 పరుగుల దూరంలో ఉన్నాడు. అలాగే వేగంగా 27000 పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచే అవకాశం కూడా ఉంది. ఇప్పటి వరకు సచిన్, కుమార సంగక్కర, రికీ పాంటింగ్ మాత్రమే అంతర్జాతీయ క్రికెట్‌లో 27,000 పరుగులను దాటగలిగారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఘనత సాధించిన ప్రపంచంలో నాలుగో బ్యాటర్ గా విరాట్ నిలవనున్నాడు.

బద్దలైనడ్రెస్సింగ్ రూమ్ గోడ..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..