AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN: 3000 రన్స్, 300 వికెట్లు.. అరుదైన క్లబ్‌లో జడ్డూ.. ఇంతకు ముందు ఎవరున్నారంటే?

ఓవర్ నైట్ స్కోరు 107/3 తో నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించింది బంగ్లాదేశ్. అయితే భారత బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. ఫలితంగా ఆ జట్టు కేవలం 233 పరుగులకే పరిమితమైంది. కాగా ఈ మ్యాచ్ ద్వారా టెస్టు క్రికెట్‌లో రవీంద్ర జడేజా 300 వికెట్లు పూర్తి చేసుకున్నాడు

IND vs BAN: 3000 రన్స్, 300 వికెట్లు.. అరుదైన క్లబ్‌లో జడ్డూ.. ఇంతకు ముందు ఎవరున్నారంటే?
Ravindra Jadeja
Basha Shek
|

Updated on: Oct 01, 2024 | 8:06 AM

Share

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టెస్టు నాలుగో రోజు భారత బౌలర్లు మెరిశారు. వర్షం కారణంగా రెండో, మూడో రోజు ఆట తుడిచిపెట్టుకుపోవడంతో మ్యాచ్‌ డ్రా దిశగా సాగుతోంది. ఇదిలావుండగా నాలుగో రోజు భారత బౌలర్లు ఏకంగా 9 వికెట్లు తీశారు. ముఖ్యంగా రవీంద్ర జడేజా బంగ్లా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఓవర్ నైట్ స్కోరు 107/3 తో నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించింది బంగ్లాదేశ్. అయితే భారత బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. ఫలితంగా ఆ జట్టు కేవలం 233 పరుగులకే పరిమితమైంది. కాగా ఈ మ్యాచ్ ద్వారా టెస్టు క్రికెట్‌లో రవీంద్ర జడేజా 300 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఖలీద్ అహ్మద్‌ను ఔట్ చేయడం ద్వారా ఈ సరికొత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు జడ్డూ. భారత్ తరఫున టెస్టు క్రికెట్‌లో 300 వికెట్లు తీసిన తొలి లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా. రవీంద్ర జడేజా కంటే ముందు బిషన్ సింగ్ బేడీ ఈ ఘనత దక్కించుకున్నాడు. అతను మొత్తం 266 వికెట్లు తీశాడు.

కాగా ప్రపంచంలో 300 వికెట్లు తీసిన మూడో లెఫ్టార్మ్ బౌలర్‌గా రవీంద్ర జడేజా నిలిచాడు. శ్రీలంక ఆటగాడు రంగనా హెరాత్ 433 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌కు చెందిన డేనియల్ వెట్టోరి 362 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక రవీంద్ర జడేజా ఆసియాలో 3000 కంటే ఎక్కువ పరుగులు, 300 వికెట్లు సాధించిన ఏకైక ఎడమచేతి వాటం స్పిన్నర్. అతను ఇమ్రాన్ ఖాన్, కపిల్ దేవ్ వంటి దిగ్గజాలను సైతం అధిగమించాడు.

ఇవి కూడా చదవండి

భారత్ (ప్లేయింగ్ ఎలెవన్):

యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI):

షాద్‌మన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో (WK), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్ (wk), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..