ICC Men’s ODI world cup India vs Bangladesh Playing XI: వన్డే ప్రపంచ కప్ 2023లో భాగంగా 17వ మ్యాచ్‌లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ గాయపడ్డాడు. ఈరోజు ఆడటం లేదు. ఆయన లేకపోవడంతో నజ్ముల్ హుస్సేన్ శాంతో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. షకీబ్ స్థానంలో నసుమ్ అహ్మద్‌కు జట్టులో అవకాశం కల్పించారు. భారత జట్టులో ఎలాంటి మార్పు లేదు.
పుణె స్టేడియం వికెట్ బ్యాటింగ్ అనుకూలంగా ఉంది. ఇక్కడ అత్యధిక స్కోరింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ స్టేడియంలో ఇప్పటి వరకు మొత్తం 7 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరిగాయి. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు నాలుగు మ్యాచ్‌లు గెలవగా, ఛేజింగ్‌లో ఉన్న జట్టు మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్టు సగటు స్కోరు 307. ఇటువంటి పరిస్థితిలో, టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడవచ్చు.
అక్యూవెదర్ ప్రకారం , పూణేలో గురువారం ఉష్ణోగ్రత 22 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఎండగా ఉంటుంది, కానీ కొన్ని మేఘాలు కూడా ఉంటాయి. వర్షం పడే అవకాశం 1% ఉంది. మ్యాచ్‌కి ముందు బుధవారం సాయంత్రం ఇక్కడ చిన్న చినుకులు పడ్డాయి. కానీ ఈరోజు ఎండగా ఉండే సూచన.
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): లిట్టన్ దాస్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(సి), మెహిదీ హసన్ మిరాజ్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(w), మహ్మదుల్లా, నసుమ్ అహ్మద్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షోరీఫుల్ ఇస్లాం.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..