IND vs AUS WTC Final : రహానే ‘హీరో’చిత ఇన్నింగ్స్‌తో కోలుకున్న టీమిండియా.. అయినా వెంటాడుతున్న ఓటమి గండం

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. అయితే మొదటి రెండు రోజులతో పోల్చుకుంటే మూడో రోజు టీమిండియా కాస్త పోరాటపటిమ ప్రదర్శించింది. అజింక్యా రహానే (89), శార్దూల్ ఠాకూర్‌ (51) వీరోచిత ఇన్నింగ్స్‌లతో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌటైంది.

IND vs AUS WTC Final : రహానే హీరోచిత ఇన్నింగ్స్‌తో కోలుకున్న టీమిండియా.. అయినా వెంటాడుతున్న ఓటమి గండం
Ajinkya Rahane

Updated on: Jun 09, 2023 | 11:15 PM

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. అయితే మొదటి రెండు రోజులతో పోల్చుకుంటే మూడో రోజు టీమిండియా కాస్త పోరాటపటిమ ప్రదర్శించింది. అజింక్యా రహానే (89), శార్దూల్ ఠాకూర్‌ (51) వీరోచిత ఇన్నింగ్స్‌లతో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌటైంది. తద్వారా ఆస్ట్రేలియాకు 173 పరుగుల ఆధిక్యాన్ని సమర్పించుకుంది. ఇక ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. దీంతో ఆసీస్‌ ఆధిక్యం మొత్తం 296 పరుగులకు చేరుకుంది. క్రీజ్‌లో లబుషేన్ (41), కామెరూన్ గ్రీన్ (7) ఉన్నారు. ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ లో జడేజా 2 వికెట్లు తీయగా, సిరాజ్‌, ఉమేశ్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. కాగా ఇప్పటికే భారీ ఆధిక్యంలో ఉన్న ఆసీస్‌ నాలుగో రోజు లంచ్‌ వరకు బ్యాటింగ్ చేసే అవకాశముంది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించాలంటే అద్భుతం జరగాల్సిందే. ప్రస్తుతం భారత జట్టు డ్రా కోసం పోరాడాల్సిందే. అయితే ఓవర్సీస్‌ పిచ్‌లు చివరి రెండు రోజులు పూర్తిగా బౌలింగ్‌కు అనుకూలిస్తాయి కాబట్టి డ్రా కూడా కష్టమేనంటున్నారు నిపుణులు.

అంతకు ముందు మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఆరంభంలోనే కేఎస్‌ భరత్‌ వికెట్‌ను కోల్పోయింది. అయితే రహానే (89), శార్దూల్‌ స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. ఏడో వికెట్‌కు 109 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. అయితే రహానే ఔటయ్యాక టీమిండియా మరోసారి పేకమేడలా కుప్పకూలింది. 296 పరుగులకు ఆలౌటై ఆసీస్‌కు 173 పరుగుల ఆధిక్యాన్ని అప్పజెప్పింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..