AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: ఆగని ‘ఫ్లాప్ షో’.. చివరి 10 ఇన్నింగ్స్‌ల్లో స్కోర్లు దారుణం.. ఇండోర్ టెస్టులో వేటు పడేనా?

రిషబ్ పంత్ గత 10 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేశాడు. ఇక ఈ జాబితాలో కేఎల్ రాహుల్ చివరి స్థానంలో ఉన్నాడు.

IND vs AUS: ఆగని 'ఫ్లాప్ షో'.. చివరి 10 ఇన్నింగ్స్‌ల్లో స్కోర్లు దారుణం.. ఇండోర్ టెస్టులో వేటు పడేనా?
Teamindia
Venkata Chari
|

Updated on: Feb 26, 2023 | 9:29 PM

Share

IND vs AUS: ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం భారత పర్యటనలో ఉంది. కంగారూ జట్టు, టీం ఇండియా మధ్య ఇక్కడ నాలుగు టెస్టు మ్యాచ్‌ల (బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023) సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. ఇప్పటివరకు జరిగిన సిరీస్‌లో ఆ జట్టు బౌలర్లు అద్భుతంగా రాణించారు. భారత బ్యాట్స్‌మెన్‌లు ఇప్పటి వరకు పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడనప్పటికీ, జట్టులోని బ్యాట్స్‌మెన్ గురించి నిరంతరం చర్చలు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో గత 10 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో టీమిండియా తరపున అత్యధిక, అత్యల్ప రన్ స్కోరర్ల గురించి ఇఫ్పుడు తెలుసుకుందాం.

గత 10 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో అత్యధిక, అత్యల్ప స్కోర్ చేసిన బ్యాటర్లు..

రిషబ్ పంత్ – గాయం కారణంగా టీమిండియాకు దూరమైన రిషబ్ పంత్ గత 10 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో భారత్‌కు మంచి ప్రదర్శన చేశారు. గత 10 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో అత్యధికంగా 663 పరుగులు చేశాడు.

రవీంద్ర జడేజా – భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గత 10 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో బంతి, బ్యాటింగ్‌తో అద్భుతాలు చేశాడు. గత 10 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 491 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

రోహిత్ శర్మ – ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. గత 10 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 489 పరుగులు చేశాడు.

శ్రేయాస్ అయ్యర్ – భారత జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ భారత్ తరపున గత 10 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 438 పరుగులు చేశాడు.

అక్షర్ పటేల్ – ఈ ఆల్ రౌండర్ భారత జట్టు తరపున గత 10 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో 349 పరుగులు చేశాడు.

ఛెతేశ్వర్ పుజారా – భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ చెతేశ్వర్ పుజారా గత 10 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 348 పరుగులు చేశాడు.

శుభ్‌మన్ గిల్ – భారత జట్టు స్టార్ ఓపెనర్ యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ గత 10 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 322 పరుగులు చేశాడు.

రవిచంద్రన్ అశ్విన్ – భారత జట్టు అనుభవజ్ఞుడైన ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ గత 10 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో 268 పరుగులు చేశాడు.

విరాట్ కోహ్లి – గత 10 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో విరాట్ కోహ్లి బ్యాట్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. కోహ్లీ బ్యాటింగ్ నుంచి 165 పరుగులు మాత్రమే వచ్చాయి.

కేఎల్ రాహుల్ – భారత జట్టు స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ బ్యాట్ ఈ రోజుల్లో చాలా దారుణంగా ఉంది. గత 10 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో అతను 125 పరుగులు మాత్రమే చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..