IND vs AUS T20I: నవంబర్ 23 నుంచి ప్రపంచకప్ ఫైనలిస్టుల మధ్య టీ20 పోరు.. పూర్తి షెడ్యూల్, ఇరుజట్ల వివరాలు ఇవే..

IND vs AUS: నవంబర్ 23, గురువారం నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. కాగా, సిరీస్‌లోని చివరి మ్యాచ్ ఆదివారం డిసెంబర్ 03న జరగనుంది. ఈ సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టును ఇప్పటికే ప్రకటించారు. కాగా, భారత జట్టును నిన్న ప్రకటించారు. ఆస్ట్రేలియాకు మాథ్యూ వేడ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. టీమిండియా సూర్యకుమార్ యాదవ్ సారథిగా ఉన్నాడు. పూర్తి షెడ్యూల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

IND vs AUS T20I: నవంబర్ 23 నుంచి ప్రపంచకప్ ఫైనలిస్టుల మధ్య టీ20 పోరు.. పూర్తి షెడ్యూల్, ఇరుజట్ల వివరాలు ఇవే..
Ind Vs Aus T20i
Follow us

|

Updated on: Nov 21, 2023 | 6:30 AM

AUS vs IND T20I: ప్రపంచ కప్ 2023 ముగిసిన తర్వాత క్రికెట్ ఫీవర్ ముగిసిపోలేదు. నవంబర్ 23, గురువారం నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. కాగా, సిరీస్‌లోని చివరి మ్యాచ్ ఆదివారం డిసెంబర్ 03న జరగనుంది. ఈ సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టును ఇప్పటికే ప్రకటించారు. కాగా, భారత జట్టును నిన్న ప్రకటించారు. ఆస్ట్రేలియాకు మాథ్యూ వేడ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. టీమిండియా సూర్యకుమార్ యాదవ్ సారథిగా ఉన్నాడు.

రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా పలువురు సీనియర్ ఆటగాళ్లు విశ్రాంతి తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియాపై యువ ఆటగాళ్ల జట్టు బరిలోకి దిగనుంది.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేసిన యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మ వంటి బ్యాట్స్‌మెన్‌లకు భారత జట్టులో అవకాశం లభించింది. అయితే, సంజు శాంసన్ వికెట్ కీపర్‌గా తిరిగి వస్తాడని అంతా భావించినా.. మరోసారి సెలెక్టర్లు హ్యాండ్ ఇచ్చారు. జితేష్ శర్మ వికెట్ కీపర్‌గా చేరాడు. బౌలింగ్‌లో ముఖేష్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్ వంటి బౌలర్లు వచ్చారు.

లైవ్‌లో ఎక్కడ చూడవచ్చు?

స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్ ద్వారా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగే ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్ భారతదేశంలో టీవీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం JioCinema యాప్‌లో చూడొచ్చు.

షెడ్యూల్ ఎలా ఉందంటే?

మొదటి మ్యాచ్- 23 నవంబర్, గురువారం, రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియం, విశాఖపట్నం.

రెండవ మ్యాచ్- 26 నవంబర్, ఆదివారం, గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం.

మూడో మ్యాచ్- 28 నవంబర్, మంగళవారం, బర్సపరా క్రికెట్ స్టేడియం, గౌహతి.

నాల్గవ మ్యాచ్- 01 డిసెంబర్, విదర్భ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్, నాగ్‌పూర్.

ఐదవ మ్యాచ్- డిసెంబర్ 03, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్.

టీ20 సిరీస్ కోసం ఇరుజట్లు..

ఆస్ట్రేలియా జట్టు: మాథ్యూ వేడ్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, టిమ్ డేవిడ్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, జోష్ ఇంగ్లిస్, తన్వీర్ సంఘా, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జాంపా.

భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..