Bengal Man: క్రికెట్‌ అంటే పిచ్చి.! భారత్‌ ఓటమి.. సూసైడ్‌ చేసుకున్న క్రికెట్‌ అభిమాని.

Bengal Man: క్రికెట్‌ అంటే పిచ్చి.! భారత్‌ ఓటమి.. సూసైడ్‌ చేసుకున్న క్రికెట్‌ అభిమాని.

Anil kumar poka

|

Updated on: Nov 21, 2023 | 8:53 AM

ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా ఓటమిని తట్టుకోలేక ఓ అభిమాని తనువు చాలించాడు. ఆదివారం రాత్రి ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్స్‌ భారతీయులకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. టోర్నీలో మొదటి నుంచి దూకుడుగా ఆడిన రోహిత్‌ సేన టైటిల్‌ పోరులో మాత్రం తడబాటుకు గురైంది. ఫలితంగా ప్రపంచకప్‌ను కళ్ల ఎదుటే చేజార్చుకుని కోట్లాది మంది భారతీయులను తీవ్ర నిరాశపరిచింది. ఈ ఓటమితో భారత క్రీడాలోకం తీవ్ర నిరాశలో కూరుకుపోయింది.

ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా ఓటమిని తట్టుకోలేక ఓ అభిమాని తనువు చాలించాడు. ఆదివారం రాత్రి ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్స్‌ భారతీయులకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. టోర్నీలో మొదటి నుంచి దూకుడుగా ఆడిన రోహిత్‌ సేన టైటిల్‌ పోరులో మాత్రం తడబాటుకు గురైంది. ఫలితంగా ప్రపంచకప్‌ను కళ్ల ఎదుటే చేజార్చుకుని కోట్లాది మంది భారతీయులను తీవ్ర నిరాశపరిచింది. ఈ ఓటమితో భారత క్రీడాలోకం తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో భారత్‌ ఓటమిని తట్టుకోలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం బంకురా జిల్లాకు చెందిన 23 ఏళ్ల రాహుల్‌ లోహర్‌కు క్రికెట్‌ అంటే పిచ్చి. బెలిటోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే అతడు.. స్థానికంగా ఉన్న ఓ బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు. ఆదివారం వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ కావడంతో సెలవు తీసుకుని ఇంట్లోనే ఉన్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా తో టైటిల్‌ పోరును వీక్షించాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఓటమిపాలవడంతో తీవ్ర మస్తాపానికి గురైన రాహుల్‌.. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని మృతుడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. అతడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు అసహజ మరణం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.