IND vs AUS: ఆస్ట్రేలియాకు బ్యాడ్ న్యూస్.. టీమిండియా పర్యటన నుంచి ముగ్గురు కీలక ఆటగాళ్లు ఔట్.. ఎందుకంటే?
T20 World Cup 2022: సెప్టెంబర్ 20 నుంచి 25 వరకు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్‌ల T20 సిరీస్ జరగనుంది.
భారత పర్యటనకు రానున్న ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు గాయపడ్డారు. గాయం ఈ ముగ్గురు ఆటగాళ్లు భారత్ సిరీస్ నుంచి తప్పించారు. టీ 20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని భారత పర్యటన నుంచి ముగ్గురు ఆటగాళ్లను మినహాయించాలని ఆస్ట్రేలియా నిర్ణయించింది. ఎందుకంటే, ఆస్ట్రేలియా ఎంపిక చేసిన టీ20 ప్రపంచకప్ జట్టులో గాయపడిన ముగ్గురు ఆటగాళ్లు కీలకమైన వాళ్లే కావడం గమనార‌్హం. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియాకు ఇది టెన్షన్‌ని పెంచే వార్తే అనడంలో సందేహం లేదు. గాయపడిన ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్‌తో పాటు ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్ పేర్లు ఉన్నాయి. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం భారత్ వచ్చే టీంను ప్రకటించింది. ముగ్గురికి చిన్నపాటి గాయాలు కావడంతో వారికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ముగ్గురు ఆటగాళ్లకు ప్రత్యామ్నాయంగా మరో ముగ్గురు ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు.
మిచెల్ మార్ష్‌కు చీలమండ గాయం ఉంది. స్టోయినిస్‌కు పక్క గాయం కారణంగా ఇబ్బంది పడుతుండగా, మిచెల్ స్టార్క్‌కు చిన్న మోకాలి గాయం ఉంది. ఈ ముగ్గురికి బదులుగా నాథన్ ఎల్లిస్, డేనియల్ సెమ్స్, సీన్ అబాట్ ఇప్పుడు భారత పర్యటనకు రానున్నారు.
ఆస్ట్రేలియా భారత పర్యటన సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ మొహాలీలో జరగనుంది. రెండో మ్యాచ్ నాగ్‌పూర్‌లో సెప్టెంబర్ 23న, మూడో టీ20 సెప్టెంబర్ 25న హైదరాబాద్‌లో జరగనుంది.
ఆస్ట్రేలియా సిరీస్ కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (కీపర్), దినేష్ కార్తీక్ (కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్.కె. అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), పాట్ కమిన్స్ (వైస్ కెప్టెన్), అష్టన్ అగర్, టిమ్ డేవిడ్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, కేన్ రిచర్డ్‌సన్, స్టీవెన్ స్మిత్, మాథ్యూ వేడ్, కామెరూన్ గ్రీన్, ఆడమ్ జంపా, నాథన్ ఎల్లిస్, డేనియల్ సెమ్స్, సీన్ అబాట్.