Ind vs Aus, Final 1st Innings Score: నిరాశపరిచిన బ్యాటర్స్.. తొలిసారి భారత్ ఆలౌట్.. ఆసీస్ ముందు స్వల్ప లక్ష్యం..

India vs Australia, Final 1st Innings Score: 2023 ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా ముందు 241 స్వల్ప లక్ష్యం నిలిచింది.

Ind vs Aus, Final 1st Innings Score: నిరాశపరిచిన బ్యాటర్స్.. తొలిసారి భారత్ ఆలౌట్.. ఆసీస్ ముందు స్వల్ప లక్ష్యం..
Ind Vs Aus, Final 1st Innings Score
Follow us
Venkata Chari

|

Updated on: Nov 19, 2023 | 6:02 PM

India vs Australia, Final 1st Innings Score: 2023 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు 241 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా తొలిసారి ఆలౌట్ అయింది.

భారత జట్టులో విరాట్ కోహ్లీ 54 పరుగులు, కేఎల్ రాహుల్ 66 పరుగులు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ 31 బంతుల్లో 47 పరుగులు చేసి భారత్‌కు వేగంగా శుభారంభం అందించగా, మిగతా ఆటగాళ్లు ఈ వేగాన్ని కొనసాగించలేకపోయారు. ఆస్ట్రేలియా జట్టులో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టాడు. పాట్ కమిన్స్ 2 వికెట్లు తీశాడు.

ఇవి కూడా చదవండి

ఇరు జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్(కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..