Video: క్రికెట్ హిస్టరీలోనే బెస్ట్ క్యాచ్.. భారత ఓటమికి, ఆసీస్ విజయానికి కారణం అదే.. మాజీల ప్రశంసలు..
Border-Gavaskar Trophy: ఇండోర్ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియన్ విజయం సాధించడంలో, టీమిండియా పేకమేడలా కుప్పకూలడంలో మలుపు తిప్పిన క్యాచ్ అదేనంటూ మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
India vs Australia, 3rd Test: ఇండోర్ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఘన విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్‌లో ఘనంగా పునరాగమనం చేసింది. అయితే, భారత్ ఓడిపోవడానికి బలమైన కారణం, ఆసీస్ విజయానికి మలుపు తిప్పిన అంశం ఏంటో ఆసీస్ ఆటగాళ్లు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఈ టెస్ట్ మ్యాచ్‌లో, కంగారూ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న స్టీవ్ స్మిత్ ఎనర్జీ ఫీల్డ్‌లో కూడా భిన్నంగా కనిపించింది. అతను స్లిప్‌లో ఒంటి చేత్తో ఛెతేశ్వర్ పుజారా అందించిన ఓ క్యాచ్‌ను అద్భుతంగా పట్టుకుని జట్టుకు టర్నింగ్ పాయింట్ అందించాడు. దీంతోనే భారత ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయింది. ఆస్ట్రేలియాకు స్వల్ప ఆధిక్యం లభించింది.
ఇండోర్ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ బ్యాటింగ్‌తో 26 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే, కెప్టెన్సీలో పాట్ కమిన్స్‌పై విజయం సాధించాడు. బౌలింగ్‌ను నిరంతరం మార్చడం, సరైన ఫీల్డింగ్‌ను ఉంచడం, బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి ఉంచడంతోపాటు, ఇండోర్ టెస్ట్ మ్యాచ్‌లో స్మిత్ తన కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు.
ఈ టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఒక ఎండ్ నుంచి వరుస వికెట్లు పడుతుండగా.. మరోవైపు ఛెతేశ్వర్ పుజారా నిరంతరాయంగా పరుగులు చేస్తున్నాడు. ఈ సమయంలో పుజారా తన అర్ధ సెంచరీని పూర్తి చేసి, మాంచి ఊపులో కనిపించాడు. అయితే, 59 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద, నాథన్ లియాన్ లెగ్ సైడ్ వైపు షాట్ ఆడాడు. అది నేరుగా లెగ్ స్లిప్ వైపునకు వెళ్లింది. ఆ సమయంలో, స్టీవ్ స్మిత్ ఈ క్యాచ్‌ను ఒంటి చేత్తో అద్భుతంగా అందుకున్నాడు. దీంతో ఆశ్చర్యపోవడం అందరివంతైంది. ఆ సమయంలో భారత జట్టు స్కోరు 8 వికెట్లకు 155 పరుగులుగా మారింది.
Could this be a match-turning catch by @stevesmith49 to dismiss @cheteshwar1 for a determined 59 #INDvAUS #classic pic.twitter.com/RFHO4lEdWV
— simon hughes (@theanalyst) March 2, 2023
నాథన్ లియాన్ ఒక్కడే 8 వికెట్లు..
ఇండోర్ టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ అద్భుత ప్రదర్శనను స్పష్టంగా చూడొచ్చు. భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో, లియాన్ తన బౌలింగ్‌లో 23.3 ఓవర్లలో మొత్తం 8 వికెట్లు పడగొట్టాడు. ఈ కారణంగా కంగారూ జట్టు 163 పరుగులకే టీమిండియా రెండవ ఇన్నింగ్స్‌ను ముగించగలిగింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..