AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘బుమ్రాకు అంత సీన్ లేదు.. ఆయన బౌలింగ్‌లో అంత పసలేదు.. నన్ను ఔట్ చేయడం ఇంపాజిబుల్’

Usman khawaja vs Bumrah: నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఓ ఆశ్చర్యకరమైన విషయం బయటకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టే జస్ప్రీత్ బుమ్రా.. టెస్టులో ఆస్ట్రేలియా జట్టులో ఓ బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయడంలో విఫలమయ్యాడు. ఆయనెవరో తెలుసా?

'బుమ్రాకు అంత సీన్ లేదు.. ఆయన బౌలింగ్‌లో అంత పసలేదు.. నన్ను ఔట్ చేయడం ఇంపాజిబుల్'
Ind Vs Aus Bumrah
Venkata Chari
|

Updated on: Nov 18, 2024 | 12:18 PM

Share

Usman khawaja vs Bumrah: జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా పేరుగాంచాడు. అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ కూడా అతని ముందు ఎక్కువ సమయం ఆడలేడు. అయితే 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు బుమ్రా గురించి టెన్షన్ పడని ఓ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ కూడా ఉన్నాడని మీకు తెలుసా? ఇప్పటి వరకు బుమ్రా స్వింగ్ బౌలింగ్‌ను సులువుగా ఎదుర్కొవడంతో.. టీమిండియాకు ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉందని అంతా భావిస్తున్నారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. బుమ్రా ఇప్పటి వరకు టెస్టుల్లో ఈ ఆటగాడిని ఔట్ చేయలేకపోయాడు. ఇక్కడ మనం ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా గురించి మాట్లాడుతున్నాం. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు, బుమ్రాను ఆడటం చాలా సులభం అంటూ షాకిచ్చాడు.

బుమ్రా బౌలింగ్‌ను ఈజీగా ఆడేస్తా..

భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ఇప్పుడు కౌంటింగ్ రోజులు మిగిలి ఉన్నాయి. నవంబర్ 22 నుంచి తొలి మ్యాచ్ జరగనుంది. దీంతో బ్యాట్‌, బ్యాట్‌ల మధ్య యుద్ధం ప్రారంభం కానుంది. పెర్త్‌లోని ఫాస్ట్ పిచ్‌పై ఇరు జట్ల బ్యాట్స్‌మెన్స్, బౌలర్లకు అసలైన టెస్ట్ జరగనుంది. అయితే, దీనికి ముందు ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా ఆశ్చర్యకరమైన ప్రకటన చేశాడు.

జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను ప్రారంభంలో కొంచెం కష్టమైనప్పటికీ, కాసేపు క్రీజులో నిలిచిన తర్వాత బ్యాట్స్‌మెన్స్ సమర్ధంగా ఎదుర్కొంటారని తెలిపాడు. బుమ్రాను ఆడటంలో ఎటువంటి సమస్య ఎదుర్కోలేదంటూ ఖవాజా చెప్పుకొచ్చాడు. గణాంకాలు కూడా ఇందుకు నిదర్శనంగా మారాయి. నిజానికి వీరిద్దరూ 2018, 2019లో టెస్టుల్లో తలపడ్డారు. ఈ సమయంలో, బుమ్రా అతనిని 155 బంతుల్లో బౌల్డ్ చేశాడు. కానీ, ఒక్కసారి కూడా అతనిని అవుట్ చేయలేకపోయాడు. ఖవాజా 43 పరుగులు చేశాడు. ఈ సిరిస్‌లో కూడా ఈ సంఖ్య అలాగే ఉంటే భారత జట్టు కష్టాల్లో పడే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఖ్వాజా ఎవరిని అతిపెద్ద ముప్పుగా పేర్కొన్నాడంటే?

అందరూ బుమ్రా గురించే మాట్లాడుతుంటారని, అయితే భారత జట్టులో అతని కంటే ప్రమాదకరమైన బౌలర్లు ఉన్నారని ఉస్మాన్ ఖవాజా అభిప్రాయపడ్డాడు. అతని ప్రకారం, ప్రస్తుతం టీమ్ ఇండియా జట్టులో లేని మహ్మద్ షమీ ఫిట్‌గా ఉన్నప్పుడు డేంజరస్ బౌలింగ్‌తో భయపెట్టేవాడు. అతడిని ఎదుర్కోవడం చాలా కష్టమైంది. అతను చాలా ఖచ్చితమైన లైన్-లెంగ్త్‌తో బంతిని సీమింగ్ చేయడంలో ప్రవీణుడు అంటూ చెప్పుకొచ్చాడు.

షమీని అర్థం చేసుకోవడం చాలా కష్టమైంది. వీరిద్దరూ 2018, 2019, 2023లో టెస్టుల్లో తలపడ్డారు. ఈ సమయంలో, షమీ అతనికి మొత్తం 296 బంతులు వేశాడు. అందులో 242 బంతులు డాట్ బాల్స్ ఉన్నాయి. అలాగే, రెండుసార్లు ఔట్ అయ్యాడు. ఖవాజా 14 ఫోర్లతో సహా కేవలం 36 స్ట్రైక్ రేట్‌తో 109 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..