IPL 2025: ఆ ప్లేయర్‌ని తీసుకుంటే ఇక ఏ ఢోకా ఉండదు.. ఆర్సీబీకి ఏబీడీ సలహా..

IPL మెగా వేలానికి ముందు RCB ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, యశ్ దయాళ్ జట్టులో కొనసాగుతున్నారు. ఇప్పుడు RCB మెగా వేలం ద్వారా 22 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు.

Velpula Bharath Rao

|

Updated on: Nov 18, 2024 | 12:20 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) సీజన్-18 మెగా వేలానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ వేలం కోసం అన్ని ఫ్రాంచైజీలు ఇప్పుడు భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈ ప్రణాళికల మధ్య, మాజీ ఆటగాడు ABD డివిలియర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ఎవరిని కొనుగోలు చేయాలనే దానిపై కొన్ని సూచనలు ఇచ్చాడు.

1 / 5
"ప్రస్తుత RCB జట్టుకు ఒక ఫినిషర్ అవసరం. కాబట్టి దక్షిణాఫ్రికా పేసర్ డేవిడ్ మిల్లర్‌ను 6వ స్థానానికి కొనుగోలు చేయాలి. వేలంలో RCB అతన్ని కొనుగోలు చేస్తుందని నేను భావిస్తున్నాను. మిల్లర్ రాకతో ఆర్సీబీ జట్టు మరింత పటిష్టంగా మారుతుంది' అని ఏబీ డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.

2 / 5
డేవిడ్ మిల్లర్ గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడాడు. అతను ఇప్పటివరకు 130 మ్యాచ్‌లు కూడా ఆడాడు. 36.55 సగటుతో 2924 పరుగులు చేశాడు. ఇందులో అతను 13 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ సాధించాడు. 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై సెంచరీ సాధించాడు.

3 / 5
ప్రస్తుతం మెగా వేలంలో ఉన్న కిల్లర్ మిల్లర్ ఫేమ్ దక్షిణాఫ్రికా ఫినిషర్‌ను ఆర్‌సీబీ జట్టు కొనుగోలు చేయడం మంచిదని, దీని ద్వారా బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టం కావచ్చని ఏబీ డివిలియర్స్ సూచించాడు. RCB ఈ సూచనను సీరియస్‌గా పరిగణిస్తుందా లేదా అనేది ఈ మెగా వేలంలో తెలుస్తుంది.

4 / 5
మెగా వేలానికి ముందు, RCB ఫ్రాంచైజీ మొత్తం ముగ్గురు ఆటగాళ్లను ఉంచుకుంది. విరాట్ కోహ్లీ రూ.21 కోట్లు, రజత్ పాటిదార్‌కు రూ.11 కోట్లు, యశ్ దయాళ్ 5 కోట్లకు రిటైన్ చేసుకున్నారు. అంటే ముగ్గురు ఆటగాళ్లను అట్టిపెట్టుకునేందుకు ఆర్సీబీ ఫ్రాంచైజీ రూ.37 కోట్లు  వెచ్చించారు. మిగిలిన రూ.83 కోట్లతో 22 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు.

5 / 5
Follow us