AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: వైజాగ్‌లో ఆస్ట్రేలియాకు మరో ఓటమి పక్కా.. టీమిండియా రికార్డులు చూస్తే ‘కంగారు’పడాల్సిందే..

IND vs AUS 2nd ODI: విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే జరగనుంది. ఇక్కడ టీమిండియాదే పైచేయిగా నిలిచింది.

IND vs AUS: వైజాగ్‌లో ఆస్ట్రేలియాకు మరో ఓటమి పక్కా.. టీమిండియా రికార్డులు చూస్తే 'కంగారు'పడాల్సిందే..
Ind Vs Aus 2nd Odi Vizag
Venkata Chari
|

Updated on: Mar 18, 2023 | 12:59 PM

Share

Dr. Y.S. Rajasekhara Reddy Cricket Stadium Stats: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ జరుగుతోన్న సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్‌లో రెండో మ్యాచ్‌ మార్చి 19, ఆదివారం విశాఖపట్నంలోని వైఎస్‌ రాజశేఖరరెడ్డి క్రికెట్‌ స్టేడియంలో జరగనుంది. ఈ మైదానంలో ఇప్పటి వరకు మొత్తం 9 వన్డేలు జరిగాయి. ఈ క్రమంలో ఈ స్టేడియానికి సంబంధించిన కీలక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

  1. విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి క్రికెట్ స్టేడియంలో ఇప్పటివరకు మొత్తం 9 వన్డే మ్యాచ్‌లు జరిగాయి.
  2. 2005లో ఈ మైదానంలో తొలి వన్డే మ్యాచ్ జరిగింది. కాగా, చివరి మ్యాచ్ 2019లో జరిగింది.
  3. ఇక్కడ ఆతిథ్య జట్టు అంటే టీమిండియా 9 మ్యాచ్‌లు ఆడి 7 గెలిచింది. ఒకదానిలో ఓడిపోయింది. ఒక మ్యాచ్ టై అయింది.
  4. ఈ మైదానంలో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు 5 మ్యాచ్‌లు గెలవగా, మొదట బ్యాటింగ్ చేసిన జట్టు మొత్తం 3 మ్యాచ్‌లు గెలిచింది.
  5. ఇవి కూడా చదవండి
  6. ఇక్కడ టాస్ గెలిచిన జట్టుకు ప్రయోజనంగా ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు 7 మ్యాచ్‌లు గెలిచి ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓడిపోయింది.
  7. ఈ మైదానంలో 2019లో వెస్టిండీస్‌పై టీమిండియా 387/5 స్కోరు చేసింది. అదే సమయంలో, న్యూజిలాండ్ 2016లో 79 పరుగుల అత్యల్ప స్కోరు చేసింది.
  8. ఇక్కడ రోహిత్ శర్మ ఒక ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 159 పరుగులు చేశాడు. 2019లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఈ స్కోరు సాధించాడు.
  9. ఈ స్టేడియంలో అమిత్ మిశ్రా పేరుతో బెస్ట్ బౌలింగ్ ఫిగర్ నమోదైంది. కేవలం 18 పరుగులకే 5 వికెట్లు పడగొట్టాడు. 2016లో న్యూజిలాండ్‌పై ఈ ఘనత సాధించాడు.
  10. ఈ స్టేడియంలో 292 పరుగుల స్కోర్‌ను సక్సెస్ ఫుల్‌గా ఛేజ్ చేశారు. 2010లో భారత్‌తో ఆడుతూ ఆస్ట్రేలియా ఈ ఘనత సాధించింది.
  11. ఇక్కడ మొదట బ్యాటింగ్ చేస్తే సగటు స్కోరు 265 పరుగులుగా వచ్చే ఛాన్స్ ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..