AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC: పాక్ వెళ్లని భారత్.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రూ. 544 కోట్లతో ప్లాన్ బీ సెట్ చేసిన ఐసీసీ.. అదేంటంటే?

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2024కి సంబంధించి ఐసీసీ తన ప్లాన్ బీని సిద్ధం చేసినట్లు ఒక నివేదిక వెల్లడించింది. ఐసీసీ ప్లాన్ బీ విలువ రూ.544 కోట్లన్నమాట. అసలు ICC ఈ ప్లాన్ B అంటే ఏమిటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ICC: పాక్ వెళ్లని భారత్.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రూ. 544 కోట్లతో ప్లాన్ బీ సెట్ చేసిన ఐసీసీ.. అదేంటంటే?
Ct 2025 Ind Vs Pak
Venkata Chari
|

Updated on: Aug 04, 2024 | 1:40 PM

Share

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఎలా సిద్ధమైంది? ఇప్పుడైతే ఈ విషయంపై ఏమీ చెప్పలేకుండా ఉంది. భారత జట్టు పాకిస్థాన్ వెళ్లి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు నిరాకరిస్తే పీసీబీ ఏం చేస్తుంది? దీనికి సంబంధించి పాక్ సన్నాహాలు సందిగ్ధంగా మారాయి. అయితే, ఈ విషయంపై ఐసీసీ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే సన్నాహాలు పూర్లి చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు టీమ్ ఇండియా పాకిస్థాన్ వెళ్లకపోతే.. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఐసీసీ రూ.544 కోట్ల ప్లాన్ బితో సిద్ధంగా ఉంది.

ఐసీసీ ‘ప్లాన్ బి’ విలువ రూ.544 కోట్లు..!

ICC ప్లాన్ B ఏంటని మీరు ఆశ్చర్యపోవచ్చు? కొలంబోలో ఇటీవల ముగిసిన వార్షిక సమావేశంలో ఐసీసీ కీలక ప్రకటన చేసింది. ఇతర బోర్డు సభ్యుల ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఇచ్చిన $65 మిలియన్లలో ప్లాన్ B సమాచారం ఉంది. 65 మిలియన్ డాలర్లు అంటే రూ.544 కోట్ల కంటే ఎక్కువ అన్నమాట.

కొలంబోలో జరిగిన ఏజీఎం సమావేశంలో ఐసీసీ పాకిస్థాన్‌కు 65 మిలియన్‌ డాలర్లు అంటే రూ.544 కోట్లకుపైగా అందజేసినట్టు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణ కోసం ఈ మొత్తాన్ని పాకిస్థాన్‌కు అందించారు. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, ఈవెంట్ కోసం పీసీబీ అందుకున్న మొత్తం, టోర్నమెంట్ కోసం భారతదేశం పాకిస్తాన్‌కు వెళ్లకపోవడం వల్ల అయ్యే ఖర్చులను కూడా కవర్ చేస్తుంది. అంటే, పీసీబీకి మరింత డబ్బు అందించనుంది. ఇది పాకిస్తాన్ వెలుపల వేరే వేదికలో టీమిండియా మ్యాచ్‌లను నిర్వహించగలదు.

వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ

వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందుకోసం పాకిస్థాన్‌లో స్టేడియాల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. ముసాయిదా షెడ్యూల్ ప్రకారం భారత్ మ్యాచ్‌లు లాహోర్‌లో జరగాల్సి ఉంది. టోర్నీలో పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో కలిసి భారత్ గ్రూప్-ఎలో చోటు దక్కించుకున్నాయి. ముసాయిదా షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది. దీని తర్వాత ఫిబ్రవరి 23న న్యూజిలాండ్‌తో తలపడనుంది. కాగా మూడో, చివరి మ్యాచ్ మార్చి 1న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..