ప్రపంచ రికార్డుల్లో “విరాట” పర్వం
రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే విరాట్.. మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అది కూడా ప్రపంచకప్ ఆడుతూ సాధించడం మరో విశేషం. వరల్డ్ కప్‌లో భాగంగా ఇవాళ వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 20 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 37 పరుగులు చేసి 20 వేల పరుగుల మార్కును కోహ్లీ అందుకున్నాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని చేరుకున్న తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ […]
రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే విరాట్.. మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అది కూడా ప్రపంచకప్ ఆడుతూ సాధించడం మరో విశేషం. వరల్డ్ కప్‌లో భాగంగా ఇవాళ వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 20 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 37 పరుగులు చేసి 20 వేల పరుగుల మార్కును కోహ్లీ అందుకున్నాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని చేరుకున్న తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు.
ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ఎక్కువ పరుగులు చేసిన వారిలో ఇండియా నుంచి సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్ ఉన్నారు. వీరి తర్వాత ఇప్పుడు మూడో వ్యక్తిగా కోహ్లీ రికార్డు సాధించాడు. ప్రపంచం మొత్తం మీద చూస్తే ఈ రికార్డు సాధించిన 12 వ ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. కోహ్లీ ఇప్పటి వరకు 417 ఇన్నింగ్స్ ఆడగా… టెస్టుల్లో 131, వన్డేల్లో 224, టీ20ల్లో 62 ఇన్నింగ్స్ ఆడాడు.
ఇప్పటి వరకు తక్కువ ఇన్నింగ్స్‌లో 20 వేల పరుగుల మార్కును చేరుకున్న వారిలో సచిన్, బ్రియాన్ లారా మొదటి ప్లేస్‌లో ఉన్నారు. 453 ఇన్నింగ్స్‌లో వాళ్లు ఆ మార్కును చేరుకున్నారు. ఆ తర్వాత 468 ఇన్నింగ్స్‌లతో రికీ పాంటింగ్ ఉన్నాడు. కానీ.. కోహ్లీ మాత్రం కేవలం 417 ఇన్నింగ్స్‌లోనే ఈ మార్క్‌ను చేరుకున్నాడు.
Mt. 20k scaled! @imVkohli becomes the quickest batsman to make 20,000 international runs. He is the third Indian after @sachin_rt and Rahul Dravid to achieve this feat.??? #TeamIndia #CWC19 #KingKohli pic.twitter.com/s8mn9sgaap
— BCCI (@BCCI) June 27, 2019