Rachin Ravindra: రచిన్ రవీంద్రకు దిష్టితీసిన నాయనమ్మ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కివీస్ ఆడిన మ్యాచ్‌లను రచిన్ నాన్న కుటుంబీకులు స్టేడియం నుంచి నేరుగా వీక్షించారు. రచిన్ తండ్రి రవి కృష్ణమూర్తి స్వస్థలం బెంగళూరు. ఆయన 90వ దశకంలో న్యూజిలాండ్‌కు వలసవెళ్లారు. రచిన్ న్యూజిలాండ్‌లోనే పుట్టాడు. రచిన్ తండ్రి రవి కృష్ణమూర్తి క్రికెట్‌కు వీరాభిమాని కూడా. అతను స్వయంగా బెంగళూరులో క్లబ్ క్రికెట్ ఆడేవాడు. అందుకే రచిన్ పులట్టినప్పుడు రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ పేర్లను కలిపి తన కుమారుడికి రచిన్ అని పేరు పెట్టారు.

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ తరఫున భారత సంతతికి చెందిన ఓపెనర్ రచిన్ రవీంద్ర బ్యాటింగ్‌లో అదరగొడుతున్నాడు. రచిన్ రవీంద్ర బెంగళూరులోని తన నాయనమ్మ ఇంటికి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. మనవడు ఇంటికి వచ్చాడన్న ఆనందంలో రచిన్ నాయనమ్మ అతనికి దిష్టితీసి ఇంట్లోకి స్వాగతం పలికింది. 23 ఏళ్ల వయస్కుడైన రచిన్ రవీంద్ర తన నాయనమ్మ ఇంటికి చేరుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రచిన్ తన జట్టు(న్యూజిలాండ్)తో కలిసి రెండు మ్యాచ్‌ల కోసం బెంగళూరు వెళ్లాడు. ఇక్కడ పాకిస్థాన్, శ్రీలంకలతో లీగ్ మ్యాచ్‌లు ఆడింది కివీస్ జట్టు. గురువారంనాడు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కివీస్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీస్ బెర్త్‌ను దాదాపుగా ఖాయం చేసుకుంది. ఈ విజయంలో రచిన్ రవీంద్ర కీలక పాత్ర పోషించాడు. బెంగళూరుతో అనుబంధం ఉన్నందున రచిన్‌కు స్టేడియంలో చాలా మద్దతు లభించింది.
బెంగుళూరులో రెండు లీగ్ మ్యాచ్‌లు అయ్యాక రచిన్.. అక్కడి తన నాయనమ్మ ఇంటికి వెళ్లారు. మనవడిని సోఫాలో కూర్చోబెట్టిన నాయనమ్మ.. రచిన్‌కు దిష్టితీసింది. ఈ వీడియో సోసల్ మీడియాలో వైరల్ కావడంతో.. నాయనమ్మ స్వచ్ఛమైన ప్రేమకు ఈ వీడియో తార్కాణమంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
రచిన్ రవీంద్రకు దిష్టితీస్తున్న నాయనమ్మ..
जय श्री राम 🕉Blessed to have such an amazing family. Grandparents are angels whose memories and blessings stay with us forever. pic.twitter.com/haX8Y54Sfm
— Rachin Ravindra (@RachinRavindra_) November 10, 2023
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కివీస్ ఆడిన మ్యాచ్‌లను రచిన్ నాన్న కుటుంబీకులు స్టేడియం నుంచి నేరుగా వీక్షించారు. రచిన్ తండ్రి రవి కృష్ణమూర్తి స్వస్థలం బెంగళూరు. ఆయన 90వ దశకంలో న్యూజిలాండ్‌కు వలసవెళ్లారు. రచిన్ న్యూజిలాండ్‌లోనే పుట్టాడు. రచిన్ తండ్రి రవి కృష్ణమూర్తి క్రికెట్‌కు వీరాభిమాని కూడా. అతను స్వయంగా బెంగళూరులో క్లబ్ క్రికెట్ ఆడేవాడు. అందుకే రచిన్ పులట్టినప్పుడు రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ పేర్లను కలిపి తన కుమారుడికి రచిన్ అని పేరు పెట్టారు.
అరంగేట్రం ప్రపంచకప్‌లో రచిన్ రికార్డు..
ICC ODI ప్రపంచకప్‌లో రచిన్ రవీంద్ర అదరగొడుతున్నాడు. అతను ఇప్పటివరకు తన జట్టు తరఫున 9 మ్యాచ్‌లు ఆడి మొత్తం 565 పరుగులు చేశాడు. దీంతో అరంగేట్రం చేసిన ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2019 వరల్డ్ కప్‌లో 532 పరుగులు చేసిన ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో రికార్డును రచిన్ తన పేరిట తిరగరాసుకున్నాడు.
సెమీ-ఫైనల్లో భారత్‌తో న్యూజిలాండ్ ఘర్షణ:
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ప్రపంచ కప్ 2023 సెమీ-ఫైనల్‌లో దాదాపుగా తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. ఈ నేపథ్యంలో నాకౌట్ దశలో మొదటి స్థానంలో ఉన్న భారత్‌తో న్యూజిలాండ్ తలపడనుంది. నవంబర్ 15న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇరు జట్లు ఢీకొననున్నాయి.