World Cup 2023: ఉయ్యాలో ఉయ్యాల !! సూపర్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీనీ కుమారుడికి అంకితమిచ్చిన మ్యాక్స్‌వెల్‌

చాలా రోజుల తర్వాత మ్యాక్స్‌వెల్‌ తన బ్యాటింగ్‌ పవర్‌ను చూపించాడు. ఈ మ్యాచ్‌లో 40 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన మ్యాక్సీ ఓవరాల్‌గా 4 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇది ప్రపంచకప్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ. ఇదే వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్క్రామ్ 49 బంతుల్లో సెంచరీ రికార్డును మ్యాక్సీ బద్దలు కొట్టాడు

World Cup 2023: ఉయ్యాలో ఉయ్యాల !! సూపర్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీనీ కుమారుడికి అంకితమిచ్చిన మ్యాక్స్‌వెల్‌
Glenn Maxwell Family

Updated on: Oct 26, 2023 | 11:33 AM

వరల్డ్‌ కప్‌ టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు మళ్లీ దూకుడు చూపిస్తోంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన కంగారూ టీమ్‌ మెగా క్రికెట్‌ టోర్నీలో మొదట తడబడింది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. అయితే మళ్లీ తనదైన ఆటతీరును ప్రదర్శిస్తూ సెమీస్‌కు చేరువైంది. తాజాగా పాట్ కమిన్స్ సారథ్యంలోని ఆసీస్‌ జట్టు బుధవారం నెదర్లాండ్స్‌పై అద్భుత విజయం సాధించింది. నెదర్లాండ్స్‌పై 309 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించింది కంగారూ టీమ్‌. ప్రపంచకప్‌లో పరుగుల పరంగా ఏజట్టుకైనా ఇదే అతిపెద్ద విజయం. ఇక చాలా రోజుల తర్వాత మ్యాక్స్‌వెల్‌ తన బ్యాటింగ్‌ పవర్‌ను చూపించాడు. ఈ మ్యాచ్‌లో 40 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన మ్యాక్సీ ఓవరాల్‌గా 4 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇది ప్రపంచకప్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ. ఇదే వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్క్రామ్ 49 బంతుల్లో సెంచరీ రికార్డును మ్యాక్సీ బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో తన సూపర్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీని మ్యాక్స్‌వెల్‌ ఇటీవలే పుట్టిన తన కుమారుడికి అంకితమిచ్చాడు. దీనికి సంకేతంగా సెంచరీ పూర్తి చేసిన తర్వాత ఊయల ఊపుతూ సంజ్ఞలు చేశాడీ స్టార్‌ ఆల్‌రౌండర్‌. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఇదిలా ఉంటే మ్యాక్స్‌వెల్‌ తమిళనాడుకు చెందిన విని రామన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2022, మార్చి 27న వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది. భారతీయ సంప్రదాయాలకు ఎంతో గౌరమిచ్చే మ్యాక్సీ వినీ రామన్‌ను కూడా తమిళ ఆచార పద్ధతుల్లోనే వినీ రామన్‌తో కలిసి పెళ్లిపీటలెక్కాడు. తమ ప్రేమ బంధానికి గుర్తుగా మే నెలలో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు మ్యాక్సీదంపతులు. జులైలో వినీ రామన్‌కు హిందూ సంప్రదాయ ప్రకారం సీమంతం కూడా జరిపారు కుటుంబ సభ్యులు. ఇక సెప్టెంబర్ 11న వినీ రామన్‌ పండంటి మగబిడ్డకు జన్మినిచ్చింది. ఇటీవలే తమ కుమారుడికి లోగన్ మ్యాక్స్‌వెల్‌ అని నామకరణం చేశారు. కాగా ఇదే మ్యాచ్‌లో డేవిడ్‌ వార్నర్ కూడా సెంచరీ సాధించాడు. కేవలం 93 బంతుల్లో 11 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 104 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

ఊయల సంజ్ఞలతో..

గ్లెన్ మాక్స్‌వెల్ భార్య వినీ రామన్ విషయానికొస్తే.. ఆమె ఆస్ట్రేలియాలోనే పుట్టి పెరిగింది. వినీ తల్లిదండ్రులది తమిళనాడు. కొన్నేళ్ల క్రితం ఉద్యోగ రీత్యా ఆస్ట్రేలియా వెళ్లి అక్కడే స్థిర పడ్డారు. విని మెడికల్ సైన్స్ చదివి వృత్తి రీత్యా ఫార్మసిస్ట్గా స్థిరపడింది. 2019లో తొలిసారిగా కలిసిన విని రామన్, గ్లెన్ మాక్స్‌వెల్‌లు మార్చి 18, 2022న క్రైస్తవ సంప్రదాయం పెళ్లిపీటలెక్కారు. ఆతర్వాత మార్చి 27, 2022న తమిళ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.

హిందూ సంప్రదాయాలకు ప్రాధాన్యం..

మరిన్నిక్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..