సుమారు రెండేళ్ల నిరీక్షణ తర్వాత ఐసీసీ అండర్ 19 ప్రపంచ కప్ తిరిగి వచ్చింది. శుక్రవారం (జనవరి 19) దక్షిణాఫ్రికా వేదికగా ఈ మెగా క్రికెట్ టోర్నీ ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో అమెరికాపై ఐర్లాండ్ 7 వికెట్ల తేడాతో గెలుపొందగా, రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఆఫ్రికా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో ఇవాళ (జనవరి 20) మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ముందుగా భారత్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. ఆ తర్వాత స్కాట్లాండ్-ఇంగ్లండ్, పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ అమీ తుమీ తేల్చుకోనున్నాయి. మొదటి మ్యాచ్‌లో గెలిచి ప్రపంచకప్ వేటను ఘనంగా ప్రారంభించాలని టీమిండియా భావిస్తోంది. 2022లో యశ్ ధుల్ సారథ్యంలో భారత్ రికార్డు స్థాయిలో 5వ సారి ప్రపంచకప్ గెల్చుకుంది. ఈసారి ఆరో టైటిల్ నెగ్గాల్సిన బాధ్యత ఉదయ్ సహారన్ నేతృత్వంలోని భారత జట్టుపై ఉంది. బ్లూమ్‌ఫోంటైన్ మైదానంలో బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాలని యువ భారత్ భావిస్తోంది.
భారత్-బంగ్లాదేశ్ అండర్-19 ప్రపంచకప్ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1:00 గంటలకు టాస్ పడనుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. బ్లూమ్‌ఫాంటైన్‌లోని పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. ఈ వికెట్‌పై భారీగా పరుగులు చేసే అవకాశముంది. ముందుగా బ్యాటింగ్ చేసే జట్టు 300-320 పరుగులు చేస్తే మ్యాచ్ లో పై చేయి సాధించినట్లే. అక్యూవెదర్ ప్రకారం, బ్లూమ్‌ఫోంటైన్‌లో శనివారం వాతావరణం వర్షం కురిసే సూచనలేమీ లేవు. . వాతావరణం ప్రకాశవంతంగా ఉటుంది. ఎండగా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత దాదాపు 30 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది.
టీమ్ ఇండియా:
అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాంషు మోలియా, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్ (కెప్టెన్), అరవెల్లి అవ్నీష్ రావు (వికెట్ కీపర్), సౌమ్య కుమార్ పాండే (వైస్ కెప్టెన్), మురుగన్ అభిషేక్, ఇనేష్ మహాజన్ (వికెట్ కీపర్), ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారీ.
బంగ్లాదేశ్ జట్టు:
మహ్ఫుజుర్ రహ్మాన్ రబీ (కెప్టెన్), ఆషికుర్ రహ్మాన్ షిబ్లీ, జిషాన్ ఆలం, చౌదరి మహ్మద్ రిజ్వాన్, ఆదిల్ బిన్ సిద్ధిక్, మహ్మద్ అష్రఫుజ్జామాన్ బోరానో, ఆరిఫుల్ ఇస్లాం, షిహాబ్ జేమ్స్, అహ్రార్ అమీన్ (వైస్ కెప్టెన్), షేక్, పర్వేజ్ పర్వేట్జ్, షేక్ , ఇక్బాల్ హసన్ ఎమాన్, వాసి సిద్ధిఖీ, మరుఫ్ మృధా.
The Uday Saharan-led squad is ready for the #U19WorldCup 😎
Get ready to support the #BoysInBlue as they take on Bangladesh tomorrow in their opening game of the tournament 👌👌#TeamIndia pic.twitter.com/JJuaHs14In
— BCCI (@BCCI) January 19, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..