T20 World Cup: సూపర్-8లో టీమిండియా ప్రత్యర్ధులు వీరే.. ఆ ఒక్క జట్టే శనిలా దాపురించింది

టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 8 బెర్తులు కన్ఫర్మ్ అయిపోయాయి. నాలుగు గ్రూపుల నుంచి 8 జట్లు సూపర్ 8 స్టేజ్‌కు అర్హత సాధించాయి. గ్రూప్-ఏ నుంచి పాయింట్స్ టేబుల్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న టీమిండియా‌తో పాటు మరో జట్టుగా యూఎస్ఏ నాకౌట్స్‌కు వెళ్లాయి. ఆ వివరాలు ఇలా..

T20 World Cup: సూపర్-8లో టీమిండియా ప్రత్యర్ధులు వీరే.. ఆ ఒక్క జట్టే శనిలా దాపురించింది
T20 World Cup
Follow us

|

Updated on: Jun 17, 2024 | 10:17 AM

టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 8 బెర్తులు కన్ఫర్మ్ అయిపోయాయి. నాలుగు గ్రూపుల నుంచి 8 జట్లు సూపర్ 8 స్టేజ్‌కు అర్హత సాధించాయి. గ్రూప్-ఏ నుంచి పాయింట్స్ టేబుల్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న టీమిండియా‌తో పాటు మరో జట్టుగా యూఎస్ఏ నాకౌట్స్‌కు వెళ్లాయి. ఇక గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్.. గ్రూప్-సీ నుంచి ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్.. గ్రూప్-డీ నుంచి దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సూపర్-8కి క్వాలిఫై అయ్యాయి.

జూన్ 19 నుంచి సూపర్ 8 రౌండ్ ప్రారంభం కానుండగా.. ఈ దశలో గ్రూప్-1 నుంచి భారత్‌తో తలపడే జట్లు ఏంటో తేలిపోయింది. ఈ సూపర్-8 స్టేజిలో ఎనిమిది టీమ్స్ రెండు గ్రూప్‌లుగా విడిపోయి.. అదే గ్రూప్‌కు చెందిన మిగతా జట్లతో తలబడతాయి. భారత్ షెడ్యూల్ ఇలా ఉంది.. సూపర్-8 స్టేజ్‌లో భారత్ తన మ్యాచ్‌లన్నీ వెస్టిండీస్‌లో ఆడనుంది. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం.. భారత్ మ్యాచ్‌లు జూన్ 20(గురువారం), జూన్ 22(శనివారం), జూన్ 24(సోమవారం) తేదీలలో జరగనున్నాయి. జూన్ 20న భారత్.. అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. జూన్ 22న టీమిండియాతో బంగ్లాదేశ్ తలపడుతుంది. ఇక జూన్ 24న భారత్, ఆస్ట్రేలియా మధ్య కీలక పోరు జరుగుతుంది.

జూన్ 19 నుంచి సూపర్ 8 రౌండ్ మొదలై 24 వరకు కొనసాగనుంది. భారత్ తన మ్యాచ్‌లను బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్, ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ మైదానం, సెయింట్ లూసియాలోని డారెన్ సామి నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌లన్నీ రాత్రి 8 గంటలకు జరుగుతాయ్.

ఈ నాలుగు జట్లలో టీమిండియాకు.. ఆస్ట్రేలియా పెద్ద టాస్క్‌గా మారనుంది. గ్రూప్ స్టేజిలో ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ అద్భుత విజయాలు అందుకున్న ఆస్ట్రేలియా.. తన సూపర్ ఫామ్‌ను తర్వాతి స్టేజిలోనూ కొనసాగించనుంది. ఆ జట్టులోని ప్రతీ ఆటగాడు ఫామ్‌లో ఉండటం.. కమిన్స్, హేజిల్‌వుడ్, స్టార్క్ లాంటి స్పీడ్‌స్టర్స్ ఉండటం.. ఆడమ్ జంపా, గ్లెన్ మ్యాక్స్‌వెల్ స్పిన్నర్లుగా ప్రత్యర్ధులను బెంబేలెత్తిస్తున్నారు. టీమిండియాకి సూపర్-8 స్టేజిలో ఇదే కీలక మ్యాచ్ కానుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles