Video: వేగంగా దూసుకొచ్చిన బంతి.. తనను తాను కాపాడుకునే క్రమంలో.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Paul Coughlin Stunning Catch: ఈ క్యాచ్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో వైరల్ అవుతోంది. ఇది టి20 బ్లాస్ట్‌లో డర్హామ్, లంకేషైర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసింది. ఈ మ్యాచ్‌లో, పాల్ కాగ్లిన్ బౌలింగ్ చేస్తున్నాడు. మాథ్యూ హర్స్ట్ స్ట్రైక్‌లో ఉన్నాడు. పాల్ కొగ్లిన్ వేసిన బంతిని ముందుకు షాట్ కొట్టాడు. బంతి స్ట్రెయిట్ బౌలర్ కోగ్లిన్ వైపు వేగంగా వెళుతోంది. దీంతో తగులుతుందేమోనని తనను తాను రక్షించుకునే క్రమంలో ఓ చేతిని ముందుకు పెట్టాడు.

Video: వేగంగా దూసుకొచ్చిన బంతి.. తనను తాను కాపాడుకునే క్రమంలో.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
Paul Coughlin Catch
Follow us

|

Updated on: Jun 17, 2024 | 3:10 PM

Paul Coughlin Stunning Catch: టీ20 ప్రపంచ కప్ 2024లో ఉత్కంఠ మ్యాచ్‌ల మధ్య టీ20 బ్లాస్ట్ టోర్నమెంట్ ఇంగ్లాండ్‌లో జరుగుతోంది. టీ20 బ్లాస్ట్‌లో కూడా రోజురోజుకు ఉత్కంఠ రేకెత్తించే మ్యాచ్‌లు జరుగుతున్నాయి. తాజాగా ఈ టోర్నీ నుంచి షాకింగ్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. వీడియోలో, బౌలర్ తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో ఆశ్చర్యకరమైన క్యాచ్‌ను తీసుకున్నాడు. ఈ క్యాచ్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

షాకింగ్ క్యాచ్ పట్టిన బౌలర్..

ఈ క్యాచ్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో వైరల్ అవుతోంది. ఇది టి20 బ్లాస్ట్‌లో డర్హామ్, లంకేషైర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసింది. ఈ మ్యాచ్‌లో, పాల్ కాగ్లిన్ బౌలింగ్ చేస్తున్నాడు. మాథ్యూ హర్స్ట్ స్ట్రైక్‌లో ఉన్నాడు. పాల్ కొగ్లిన్ వేసిన బంతిని ముందుకు షాట్ కొట్టాడు. బంతి స్ట్రెయిట్ బౌలర్ కోగ్లిన్ వైపు వేగంగా వెళుతోంది. దీంతో తగులుతుందేమోనని తనను తాను రక్షించుకునే క్రమంలో ఓ చేతిని ముందుకు పెట్టాడు.

కఫ్లిన్ తన చేతిని ముందుకు పెట్టినప్పుడు, బంతి అతని కుడి చేతిలో ఇరుక్కుపోయింది. దీంతో బ్యాట్స్‌మన్ క్యాచ్ ఔట్ అయ్యాడు. కఫ్లిన్ తీసుకున్న ఈ ప్రమాదకరమైన క్యాచ్‌ని చూసి స్టేడియంలో ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. పాల్ కొగ్లిన్ ఇంత వేగంగా షాట్ పట్టాడంటే ఎవరూ నమ్మలేదు. కఫ్లిన్ క్యాచ్ గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తోంది.

ఇక మ్యాచ్ గురించి చెప్పాలంటే డర్హామ్, లంకేషైర్ మధ్య జరిగిన మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్‌లో డర్హామ్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డర్హామ్ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. డర్హామ్ తరపున గ్రాహం క్లార్క్ 57 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 87 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

219 పరుగుల ఛేదనలో లంకేషైర్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఈ మ్యాచ్‌లో డర్హామ్ స్కోరు కంటే 2 పరుగులు వెనుకబడి మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో కల్లమ్ పార్కిన్సన్ 4 ఓవర్లలో 31 పరుగులిచ్చి 3 భారీ వికెట్లు పడగొట్టాడు. అతను డర్హామ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఎన్పీఎస్ 2.0 వచ్చేస్తోంది.. కొత్త వెర్షన్లో మరిన్ని ప్రయోజనాలు..
ఎన్పీఎస్ 2.0 వచ్చేస్తోంది.. కొత్త వెర్షన్లో మరిన్ని ప్రయోజనాలు..
మార్కెట్‌‌లో మరో నయా స్కూటర్‌ రిలీజ్‌ చేసిన ఇవూమీ..!
మార్కెట్‌‌లో మరో నయా స్కూటర్‌ రిలీజ్‌ చేసిన ఇవూమీ..!
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్..
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్..
పేరు వింటే తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి..
పేరు వింటే తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి..
అప్రమత్తంగా ఉండండి.. ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచన..
అప్రమత్తంగా ఉండండి.. ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచన..
అమ్మో.. మహానంది అలయ పరిసరాల్లో చిరుత హల్ చల్.. భయాందోళనలో భక్తులు
అమ్మో.. మహానంది అలయ పరిసరాల్లో చిరుత హల్ చల్.. భయాందోళనలో భక్తులు
ఐటీ ఫైల్‌ చేసే వారికి అలెర్ట్‌..కేంద్రం నిర్ణయంపైనే ఆశలన్నీ..!
ఐటీ ఫైల్‌ చేసే వారికి అలెర్ట్‌..కేంద్రం నిర్ణయంపైనే ఆశలన్నీ..!
మీ బైక్‌కి మీరే సర్వీసింగ్ చేసుకోవచ్చు.. ఈ టిప్స్‌తో ఇంట్లోనే..
మీ బైక్‌కి మీరే సర్వీసింగ్ చేసుకోవచ్చు.. ఈ టిప్స్‌తో ఇంట్లోనే..
నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌లో కొలువులకు నోటిఫికేషన్‌ విడుదల
నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌లో కొలువులకు నోటిఫికేషన్‌ విడుదల
పీఎం కిసాన్ డబ్బులు పోస్టాఫీసు నుంచి కూడా తీసుకోవచ్చు!
పీఎం కిసాన్ డబ్బులు పోస్టాఫీసు నుంచి కూడా తీసుకోవచ్చు!