Pravelen Subrien : వీడి బౌలింగ్ ఏదో అనుమానంగా ఉందే.. ఫస్ట్ మ్యాచ్‌లోనే డౌట్.. ఐసీసీకి ఫిర్యాదు
దక్షిణాఫ్రికా జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. రెండు జట్ల మధ్య టీ20, వన్డే సిరీస్‌లు జరుగుతున్నాయి. ఇప్పటికే జరిగిన టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1 తేడాతో గెలుచుకుంది. ఇప్పుడు రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతోంది.

Pravelen Subrien : ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు, ఆస్ట్రేలియాతో టీ20, వన్డే సిరీస్‌లు ఆడుతోంది. మొదట జరిగిన టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1తో గెలుచుకుంది. ఇప్పుడు రెండు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా గెలుచుకుని శుభారంభం చేసింది. అయితే, ఈ మ్యాచ్ ద్వారా వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన యువ బౌలర్‌పై మ్యాచ్ అధికారులు ఐసీసీకి ఫిర్యాదు చేశారు.
ఆస్ట్రేలియాపై మొదటి వన్డే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తరపున వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఆఫ్ స్పిన్నర్ ప్రెనెలాన్ సుబ్రియన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కానీ మ్యాచ్ తర్వాత ప్రెనెలాన్ సుబ్రియన్ బౌలింగ్ శైలిపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఆయనపై ఐసీసీకి ఫిర్యాదు అందింది. దీనితో ఆయన తన బౌలింగ్‌ను పరీక్షించుకోవడానికి ఐసీసీ గుర్తించిన పరీక్షకు వెళ్లాల్సి ఉంటుంది.
ప్రెనెలాన్ సుబ్రియన్ బౌలింగ్ చట్టబద్ధతను ప్రశ్నిస్తూ మ్యాచ్ అధికారులు ఐసీసీకి నివేదికను సమర్పించారు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన ఆయన, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ వికెట్ తీశాడు. అంతకు ముందు ఈ ఏడాది జింబాబ్వేలోని బులోవాయోలో జరిగిన మ్యాచ్‌లో టెస్ట్‌లోకి అరంగేట్రం చేసిన సుబ్రియన్, మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం.. సుబ్రియన్ తన బౌలింగ్ శైలిని పరిశీలించడానికి ఐసీసీ గుర్తించిన పరీక్షా కేంద్రంలో పరీక్ష చేయించుకోవాలి. అయితే, ఈ ప్రక్రియలో టెస్ట్ రిజల్ట్స్ వచ్చే వరకు సుబ్రియన్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయడానికి అనుమతి లభిస్తుంది.
Prenelan Subrayen has been reported for a suspect bowling action following his debut in the first ODI against Australia pic.twitter.com/prQNYZHAoO
— Cricbuzz (@cricbuzz) August 20, 2025
ప్రెనెలాన్ సుబ్రియన్ గత కొన్ని సంవత్సరాలుగా దక్షిణాఫ్రికా తరపున దేశీయ క్రికెట్ ఆడుతున్నాడు. ఇప్పటివరకు 78 ఫస్ట్-క్లాస్, 102 లిస్ట్-ఎ, 120 టి20 మ్యాచ్‌లు ఆడాడు. అలాగే దక్షిణాఫ్రికా టి20 లీగ్ ఎస్ఏ20లో కూడా భాగమయ్యాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




