Vinod Kambli Health Update: నడవడమే కాదు, మాట్లాడడంలోనూ ఇబ్బంది.. విషమంగా వినోద్ కాంబ్లి ఆరోగ్యం..
Vinod Kambli News: వినోద్ కాంబ్లి ఆరోగ్యం మెరుగుపడింది. కానీ, అతను పూర్తిగా కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుంది. తన అన్నయ్య కోసం ప్రార్థనలు చేస్తూ ఉండాలని వీరేంద్ర కాంబ్లి అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కాంబ్లి బాంద్రాలోని తన ఇంట్లో నివసిస్తున్నాడు.

Vinod Kambli Health Update: టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి ఆరోగ్యం ఇంకా పూర్తిగా కోలుకోలేదని ఆయన తమ్ముడు వీరేంద్ర కాంబ్లి వెల్లడించారు. 53 ఏళ్ల వినోద్ కాంబ్లి గత ఏడాది అక్టోబర్‌లో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్‌తో పాటు, మెదడులో గడ్డకట్టడంతో కూడా బాధపడుతున్నారు. అయితే, చికిత్స తర్వాత ఆయన ఆరోగ్యం మెరుగుపడింది. కానీ, ఆయన తమ్ముడు వీరేంద్ర ఇప్పుడు చెప్పినది నిజంగా దయనీయంగా మారింది. తన మాటలతో అభిమానుల హృదయాలను గెలుచుకున్న వినోద్ కాంబ్లి ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాడని తెలిస్తే మీరు బాధపడతారు.
కాంబ్లీ తమ్ముడు ఏం చెప్పాడంటే..
వినోద్ కాంబ్లి ఆరోగ్యం మెరుగుపడింది. కానీ, అతను పూర్తిగా కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుంది. తన అన్నయ్య కోసం ప్రార్థనలు చేస్తూ ఉండాలని వీరేంద్ర కాంబ్లి అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కాంబ్లి బాంద్రాలోని తన ఇంట్లో నివసిస్తున్నాడు. మాట్లాడటం, నడవడం ఇబ్బందిగా ఉంది. అతని చికిత్స ఇంకా కొనసాగుతోంది. అతను మాట్లాడటంలో ఇబ్బంది పడుతున్నాడు. అతను కోలుకోవడానికి సమయం పడుతుంది. కానీ, అతను ఒక ఛాంపియన్, అతను తిరిగి వస్తాడు. అతను త్వరలో నడవడం, పరుగెత్తడం ప్రారంభిస్తాడని ఆశిస్తున్నాను. నాకు అతనిపై చాలా నమ్మకం ఉంది. మీరు అతన్ని మళ్ళీ మైదానంలో చూడాలని నేను కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
వినోద్ కాంబ్లి పరిస్థితి..
వినోద్ కాంబ్లీకి ఎలా చికిత్స జరుగుతుందో వీరేందర్ కాంబ్లీ వివరించారు. వినోద్ కాంబ్లీ 10 రోజుల పాటు పునరావాసం పొందారని ఆయన తెలిపాడు. మెదడు స్కాన్, మూత్ర పరీక్షతో సహా అతని మొత్తం శరీరాన్ని పరీక్షించారు. పరీక్ష ఫలితాలు సరిగ్గా ఉన్నాయి. పెద్ద సమస్య ఏదీ తేలలేదు. కానీ, అతను నడవలేకపోయాడు. కాబట్టి, అతనికి ఫిజియోథెరపీ సూచించారు. అతని మాటలు ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, అతని పరిస్థితి మెరుగుపడుతోంది. ‘అతను త్వరగా కోలుకోవడానికి ప్రజలు అతని కోసం ప్రార్థించాలని నేను కోరుకుంటున్నాను. అతనికి మీ ప్రేమ, మద్దతు అవసరం.’ కాంబ్లీ కుటుంబంలో నలుగురు సోదరులు ఉన్నారని వీరేందర్ వెల్లడించారు. వినోద్, వీరేంద్ర, వికాస్, విద్యాధర్. వినోద్ లాగే, వీరేందర్ కూడా క్రికెటర్ కావాలని కలలు కన్నాడు. కానీ, అతని కెరీర్ అంత విజయవంతం కాలేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








