ICC Rankings: టెస్టుల్లో టీమిండియా నంబర్ వన్ ర్యాంక్ గోవిందా! వన్డేలు, టీ20ల్లో మాత్రం..

|

May 03, 2024 | 8:09 PM

ఐసీసీ విడుదల చేసిన టెస్టు జట్ల వార్షిక ర్యాంకింగ్స్‌లో చాలా రోజులుగా అగ్రస్థానంలో ఉన్న టీమ్ ఇండియా.. ఇప్పుడు నంబర్ 1 స్థానం నుంచి నంబర్ 2కు పడిపోయింది. ఐపీఎల్ ప్రారంభానికి ముందు, టీం ఇండియా ఇంగ్లాండ్‌తో స్వదేశంలో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌ను భారత జట్టు 4-1 తేడాతో కైవసం చేసుకుంది.

ICC Rankings: టెస్టుల్లో టీమిండియా నంబర్ వన్ ర్యాంక్ గోవిందా! వన్డేలు, టీ20ల్లో మాత్రం..
Team India
Follow us on

ఐసీసీ విడుదల చేసిన టెస్టు జట్ల వార్షిక ర్యాంకింగ్స్‌లో చాలా రోజులుగా అగ్రస్థానంలో ఉన్న టీమ్ ఇండియా.. ఇప్పుడు నంబర్ 1 స్థానం నుంచి నంబర్ 2కు పడిపోయింది. ఐపీఎల్ ప్రారంభానికి ముందు, టీం ఇండియా ఇంగ్లాండ్‌తో స్వదేశంలో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌ను భారత జట్టు 4-1 తేడాతో కైవసం చేసుకుంది. దీంతో టెస్టు జట్లలో ఐసీసీ మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఇప్పుడీ టాప్ ర్యాంక్ ను ఆస్ట్రేలియా జట్టు కైవసం చేసుకుంది. 124 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం కొత్త టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉంది. మొదటి స్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయిన టీమ్ ఇండియా ఖాతాలో 120 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రెండు జట్ల మధ్య 4 రేటింగ్ పాయింట్ల తేడా మాత్రమే ఉంది. మూడో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ జట్టు 109 రేటింగ్ పాయింట్లతో ఉంది.

దక్షిణాఫ్రికా జట్టు 103 రేటింగ్ పాయింట్లతో 4వ స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ జట్టు 96 రేటింగ్ పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. పాకిస్థాన్ 89 రేటింగ్ పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. ఐసీసీ ఈరోజు మూడు ఫార్మాట్ల క్రికెట్‌కు సంబంధించిన వార్షిక ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం, ప్రచురించిన ర్యాంకింగ్ జాబితాలో అనేక మార్పులు జరిగాయి. టీమ్ ఇండియా 2 ఫార్మాట్లలో నంబర్ 1 స్థానంలో ఉంది. ముందుగా టీ20 జట్ల ర్యాంకింగ్ జాబితాను పరిశీలిస్తే.. ఈ ప్యాటర్న్‌లో ఎప్పటిలాగే టీమ్ ఇండియా 264 రేటింగ్‌తో మొదటి స్థానంలో ఉంది. అంతకుముందు కూడా భారత్‌ నంబర్‌వన్‌గా ఉంది. ఇప్పుడు వార్షిక ర్యాంకింగ్ జాబితాలో అదే స్థానంలో కొనసాగుతోంది.

చాలా కాలంగా రెండో స్థానంలో ఉన్న ఇంగ్లిష్ జట్టు 1 స్థానం దిగజారి మూడో స్థానానికి చేరుకుంది. ఇక ఒక స్థానం ఎగబాకిన ఆస్ట్రేలియా ఇప్పుడు రెండో స్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియా ఖాతాలో 257 రేటింగ్ పాయింట్లు, ఇంగ్లండ్ ఖాతాలో 252 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. దక్షిణాఫ్రికా 250 రేటింగ్‌తో రెండు స్థానాలు దిగజారి నాలుగో స్థానానికి పడిపోయింది. న్యూజిలాండ్ ఒక స్థానం కోల్పోయి 250 రేటింగ్‌తో 5వ స్థానంలో నిలిచింది. వెస్టిండీస్ జట్టు 249 రేటింగ్‌తో 6వ స్థానంలో ఉంది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు రెండు స్థానాలు దిగజారి 247 రేటింగ్ తో ఏడో స్థానంలో నిలిచింది. మిగతా చోట్ల, శ్రీలంక 232 రేటింగ్‌తో ఎనిమిదో స్థానంలో ఉంది, బంగ్లాదేశ్ తొమ్మిదో స్థానంలో మరియు ఆఫ్ఘనిస్తాన్ పదో స్థానంలో ఉంది.ఇక వన్డే ఫార్మాట్‌లో కూడా 122 రేటింగ్ పాయింట్లతో టీమ్ ఇండియా మొదటి స్థానంలో ఉండగా, 116 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..